ఆ హీరోయిన్ చేసిన ఒక్క తప్పుతో... ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా?

VAMSI
ఒక్కోసారి మనము చేసే కొన్ని పొరపాట్ల కారణంగా సమాజానికి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు బంధువులకు దూరమావుతూ ఉంటాము. అయితే ఈ విషయం తెలియక చాలా మంది ఒంటరిగా ఎవరి సాయమూ లేకుండా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ అలాంటి సమయంలో మనము ఏ విధంగా ఈ సమాజంలో బ్రతకాలి ? ఏంటి మన పరిస్థితి ? అన్నది తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. కానీ ఒక సెలెబ్రిటీ ఈ బాధను ఇప్పుడు స్వయంగా అనుభవిస్తోంది. మరి ఆమె ఎవరో ? తాను ఏ తప్పు చేసి ఈ శిక్షను అనుభవిస్తోందో ఒకసారి చూద్దాం.
ఆమె పేరు నటి సంజన గల్రాని... ప్రభాస్ నరించిన బుజ్జిగాడు సినిమా ద్వారా త్రిషకు చెల్లెలిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అంతే కాకుండా తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన ఎందుకో రాణించలేకపోయింది. సంజన సోషల్ మీడియాలో పలు రకాల పోస్ట్ లు పెడుతూ సరదాగా ఉంటుంది. అయితే అనుకోకుండా గత సంవత్సరం డ్రగ్స్ కేసులో బందీ అయింది. పక్క ఆధారాలు దొరకడంతో సంజను అరెస్ట్ చేసి మూడు నెలలు జైల్లో ఉంచారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తన జీవితం మారిపోయింది. ఈమెను కుటుంబ సభ్యులు, బంధువులు మరియు కొందరు స్నేహితులు వెలివేశారు. ఎంతలా అంటే కనీసం మాటలు కూడా లేదు. అయితే ఆ తర్వాత ఈమె బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండడానికి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తోంది.
కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తన కుటుంబంతో శాశ్వతంగా బంధం తొలగిపోయినట్లే అని తెలుస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు రెండు ఉన్నాయి. హీరో ఆది పినిశెట్టి  తో తన సొంత చెల్లెలు నిశ్చితార్ధం చెన్నైలో జరిగితే ఎవ్వరి నుండి తనకు ఆహ్వానం అందలేదు. ఇక ఆ తర్వాత తనకు పెళ్లి అయి గర్భవతి అయినా ఆ విషయాన్ని పంచుకునేందుకు సొంతవాళ్ళు లేరు. ఆఖరికి శ్రీమంతం కూడా కొందరి స్నేహితులు కలిసి చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? తప్పు చేశారని కన్నబిడ్డలను వదిలేసుకుంటామా ? ఇంకా ఏ సమాజములో ఉన్నాము.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: