జాన్వీ కపూర్ సినిమాల్లోకి రావడం ఆ హీరోకి నచ్చదట... ?

VAMSI
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి అటు హిందీలోనూ తన సత్తా చాటారు. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక వీరి ముద్దుల కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు ముంబై లోనే పెరిగి పెద్దయినా టాలీవుడ్ లోనూ వీరు రాణించాలన్నది తెలుగు ప్రేక్షకుల ఆకాంక్ష. హిందీలో "దఢక్" అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుసగా చిత్రాలు చేస్తోంది. ఇక ఈమె హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేయక ముందే గోల్డెన్ స్పూన్ తో పుట్టింది. ఈమె లగ్జరీ గానే లైఫ్ ని ట్రావెల్ చేస్తున్న విషయం తెలిసిందే.
జాన్వి కపూర్ కి ఇపుడు వయసు జస్ట్ 23 ఏళ్లు మాత్రమే. లాస్ ఏంజిల్స్ లో తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకుని వచ్చారు జాన్వీ. జాన్వీ కపూర్ ఒక్కో చిత్రానికి 5 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నారు. తన మొదటి సినిమాతోనే మార్కెట్ ను పెంచుకున్న ఈ అందాల తార సోషల్ మీడియా లోనూ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ఇక ఈమెకి కుషి కపూర్ ఎంతో అలాగే అన్నయ్య అర్జున్ కపూర్ కూడా అంతేనట. నిజానికి వీరి తల్లులు వేరైనా చిన్నతనం నుండి కలిసే పెరగడం, నటి శ్రీదేవి అర్జున్ కి స్టెప్ మదర్ అయినప్పటికీ తన సొంత కూతుర్లతో సమానంగా అర్జున్ ని కూడా చూసుకోవడంతో అర్జున్ కూడా ఎపుడు వీరిని వేరు చేసి చూడరట.
చెల్లెలు ఏదైనా అడిగితే కాదన్న సందర్భమే ఉండదని బాలీవుడ్ లో టాక్. ముఖ్యం గా జాన్వీ కపూర్ అంటే అన్నయ్య అర్జున్ కి పంచ ప్రాణాలు నిజానికి చెల్లెళ్ళు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని అనుకునేవారట అర్జున్. అర్జున్ కపూర్ కూడా బాలీవుడ్ లో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జాన్వీ కపూర్ కి నటనపై ఉన్న మక్కువ చూసి కాదనలేక దగ్గరుండి మరీ తనని యాక్టింగ్ రంగంలోకి పంపించారని అంటుంటారు. అంతే కాకుండా జాన్వీ కపూర్ మూవీ షూటింగ్ జరుగుతుంది అంటే అక్కడికి అన్నయ్య అర్జున్ తప్పకుండా వచ్చి వెళుతుంటారట. కాగా త్వరలోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ మూవీ స్టార్ట్ కానుంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా రానుంది. అందులో జాన్వీని హీరోయిన్ గా ఎంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: