న‌య‌నతార కు పెళ్లి గండం ఉందా?

Dabbeda Mohan Babu
ఒక తెలుగు లోనే కాకుండా ద‌క్షిణ భార‌త దేశంలో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ ల‌లో న‌య‌న‌తార కూడా ఒక్క‌రు. న‌య‌నతార త‌న దైన మార్క్ సినిమా ల తో లేడి సూప‌ర్ స్టార్ అనే పేరు కూడా సంపాదించు కుంది. అయితే ఈ బామ పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న ప్ర‌తి సారి ఎదో ఒక స‌మ‌స్య వ‌చ్చి వాయిదా ప‌డుతుంది. అలాగే క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే న‌య‌న‌తార ముందుగా వ‌ల్ల‌వ‌న్ అనే త‌మిళ్ సినిమా లో నటించిన స‌మ‌యంలో సిలంబ‌ర‌న్ అనే హీరో తో ల‌వ్ ట్రాక్ నడిపించిందని టాక్. ఈ సిలంబ‌ర‌స‌న్ నే శింబు అని కూడా అంటారు. అయితే ఈ ల‌వ్ ట్రాక్ పెళ్లి పీఠ‌లు ఎక్క‌క ముందే విడిపొయింద‌ని అంటారు.

అయితే ప్ర‌ముఖ హీరో డాన్స‌ర్ ప్ర‌భుదేవా తో లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న తార చాలా కాలం పాటు ప్రేమాయనాన్ని న‌డిపించింది. అంతే కాకుండా వీరు ఇద్ద‌రు వివాహాం చేసుకోవాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే వీరి పెళ్లి చాలా ర‌కాలు గా అడ్డంకులు వ‌చ్చాయి. ముఖ్యంగా ప్ర‌భుదేవా భార్య పెద్ద అడ్డంకి గా మారింది. ప్ర‌భు దేవా భార్య ఎకంగా విష‌యం పై కోర్టు మెట్లు కూడా ఎక్కింది. న‌య‌న తార త‌న భ‌ర్త జీవితం లోకి రాకుండా చూడాల‌ని పిటిష‌న్ కూడా వేసింది. అయితే దీని పై పెద్ద ర‌గ‌డ నే అయింది. త‌మిళ సంఘాలు కూడా న‌య‌నతార ను వ్య‌తిరేకిస్తు ఆందోళన కూడా చేశారు. దీంతో చివ‌రికి న‌య‌నతార ప్ర‌భుదేవాతో ఉన్న సంబంధానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

తాజా గా ఈ లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న తార విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమాయ‌ణం లో ఉంది. వీరు కూడా పెళ్లి పీఠ‌లు ఎక్క‌డానికి స‌ర్వ సిద్దం అయ్యారు. విఘ్నేష్ కోసం నయన‌తార ఏకంగా త‌న మ‌తాన్ని కూడా మార్చుకుంది. అయితే ఇప్ప‌టి కే వీరి వివాహాం కావాల్సి ఉంది. అయితే న‌య‌న తార నే ఈ వివాహాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేసిన‌ట్టు స‌మాచారం. అయితే న‌య‌న‌తార కు విఘ్నేష్ శివ‌న్ ఇప్ప‌టి కే పెళ్లి జ‌రిగి పోయింద‌నే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: