సన్నగా, బలంగా ఉండే శరీరం కోసం, గుండె ఆరోగ్యం కోసం, మృదువైన చర్మం కోసం, మెరుస్తున్న జుట్టుకోసం, మీ ఆహారంలో ప్రతిసారి కొవ్వు ఉండేట్టు చూసుకోవాలి. కనీసం మూడుపూట్ల మీరు తినే భోజనంలో అంటే నూనేతో వండిన వంటకాలు మాత్రమే తింటే సరిపోదు.
పెంకు ఉండే పప్పుల్నీ, చీజ్‌ని, లేదా మరేదైనా పాల ఉత్పత్తినీ భోజనంలో చేర్చండి. ఆరోగ్యకరమైన కొవ్వుల్ని ఆరోగ్యకరంగా( తగిన పాళ్లలో అని చదవండి) తినటం వల్ల మీ శరీరం తన పని తను సవ్యంగా చేసుకోగలగుతుంది. తగినంత కొవ్వుని కరిగించగలుగుతుంది. కొవ్వు పధార్థాలని పిండి పధార్థాలతోనూ, మాంసకృత్తులతోనూ కలిపి తిన్నప్పుడు ఆహారం తాలూకు గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది.
(ఇదే అధ్యాయంలో ముందు పిండిపధార్థాల ప్రస్తావన ఒక సారి చూడండి) అందుచేత అవి నెమ్మదిగా రక్తంలోకి చక్కెరని విడిచిపెడతాయి. దీనివల్ల కొవ్వు చక్కగా కరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. ఆకలి తక్కువ వేస్తుంది. మనసు ఉల్లాసంగా ఉండి, ఒంటికి మంచి రంగు కూడా వచ్చి చర్మం నిగనిగలాడుతుంది.
అందుకని నూనెన కూరలూ, పప్పు వండేందుకు వాడండి, చాలామంది బారతీయులు చేసేది. అదే, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయ్యద్దు, వీలైనంత వరకూ రకరకాల నూనెలు వాడాలి. మధ్యాన్నం భోజనం వేరుశెనగ నూనెతో వండితే రాత్రికి సోయానూనె లేక కుంకుమ పువ్వునూనె వాడండి. మీ ఆహారంలో వేరుశెనగ పప్పుల్ని, చీజ్ చేర్చండి.
అసలు అవే ఒక చిన్నిపాటి భోజనంగా అనిపిస్తాయి. కొవ్వుపధార్థాలని ఆహారంలో చేర్చటం వల్ల మానిసికమైన ఒడిదుడుకులు కూడా తగ్గిపోతాయి. నిరాశానిస్పృహలు దగ్గరికి రావు ఒమేగా 3 తగినంతగా అందకపోతే పిల్లల్లో నేర్చుకునే శక్తి సన్నగిలుతుంది. తన బహిష్టు రోజుల్లో మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? ఆమెకు జనుము గింజలతో చేసిన పధార్థం కాని, నెలరోజులకి సరిపడే బాదం, జీడిపప్పులు గాని కొనివ్వండి.
మరింత సమాచారం తెలుసుకోండి: