జుట్టు మరీ పొడిబారి, బిరుసుగా ఉన్నట్లయితే, అరటిపండు గుజ్జు చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. 30 నిమిషాలు ఉంచి తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.
ఒక కప్పు పెరుగులో 1 టీ స్పూన్ కాఫీ డికాషన్ కలిపి రాత్రంతా నాననివ్వాలి.
ఈ మిశ్రమాన్ని ఉదయం తలకు పట్టించి 45 నిమిషాలు ఉంచి తలస్నానం చేయాలి.
3 టీ స్పూన్ల గోరింటాకు పొడిలో, అరటిపండు, ¼ కప్పు పుల్లటి మజ్జిగ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా చేస్తే జుట్టు పొడి భారకుండా కాబాడుతుంది. జుట్టు చిట్లుతుంటే: 1 టీస్పూన్ ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకు, జుట్టు చివర్ల ఆయిల్ కలిపి తలకు పట్టించి మర్థన చేసి జుట్టు మొత్తానికి పట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి.
జుట్టు రాలుతుంటే ...
తాజా వేప తులసీ ఆకుల పేస్టుని తలకు పట్టించి 30 ని.లు తర్వాత తలస్నానం చేయాలి. తాజా కరివేపాకును శీకాకాయతో కలిపి గ్రైండ్ చేసి, తలకు బాగా పట్టించి 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. పచ్చి కొబ్బరి పాలను పట్టించి, 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: