ఎన్టీఆర్ ను బిర్యానీతో సర్ ప్రైజ్ చేసిన ప్రముఖ డైరెక్టర్..!
అయితే బిర్యానీ అక్కడ ఇక్కడ బిర్యానీ కాదు.. ఏకంగా చెన్నై నుంచి వస్తూ ఎన్టీఆర్ కోసం బిర్యాని పార్సల్ తీసుకొచ్చారట ఆ డైరెక్టర్. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి చెన్నై బిర్యానీ అంటే తెగ ఇష్టం ఇక ఈ విషయాన్ని కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ అందరికీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని డైరెక్టర్ అట్లీ ఎన్టీఆర్ కు ఒక కథ వినిపించాలి అనుకొని ఎన్టీఆర్ దగ్గరకు రావాలి అని ఫోన్ చేసి చెప్పారట. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తున్న సమయంలో.. ఎన్టీఆర్ అట్లీ కి ఫోన్ చేసి తలపాకట్టి బిర్యానీ తీసుకురావాల్సిందిగా కోరినట్లు సమాచారం.
దీంతో ఎన్టీఆర్ కోసం అట్లీ బిర్యానీ ఆర్డర్ చేశారట.. కానీ సునీల్ అయితే వచ్చి తిని వెళ్ళచ్చు కదా అని అట్లీ తో తనకున్న పరిచయంలో సునీల్ తెలపగా .. కానీ అది తన కోసం కాదు అని ఎన్టీఆర్ కోసం అని చెప్పారట.. దాంతో వెంటనే సునీల్ కూడా షాక్ అయినట్లు తెలిపారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఆ తర్వాత అట్లీ డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.