తల్లిగా.. మీ పిల్లల ముందు బాధపడుతున్నారా ?

VAMSI
తమ పిల్లలే సర్వస్వం అనుకుంటుంది తల్లి. ప్రేమగా వారి బాధ్యతను తీసుకోవడానికి సిద్ధపడతాడు తండ్రి. ఇద్దరు కూడా తమ పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తారు, తమ వంతుగా ఎంత చేయాలో అంతకు మించే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అయితే పిల్లలు తండ్రితో కంటే తల్లితో ఎక్కువ అనుభందాన్ని ఏర్పరుచుకుంటారు. సంతోషం కలిగితే ముందుగా తల్లితో పంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా తమ తల్లికే చెప్పాలని అనుకుంటారు. తమ తల్లినే రోల్ మోడల్ గా తీసుకుంటారు మరి కొందరు. ఏదేమైనా తమ ముందు తమ తల్లి ఉందని చాలా ధైర్యంగా ఉంటారు.
అలాంటప్పుడు అదే తల్లి నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకుంది అంటే ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. వారు ఏ విధంగా ప్రభావితం అవుతారో తెలుసా ? తల్లి ఎపుడు కూడా తమ పిల్లలకు ఆదర్శంగా ఉండాలని, వారికి తానున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. కానీ అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు కొన్ని సార్లు బిడ్డలు ఎదురుగా ఉన్నారన్న విషయం కూడా మరిచిపోయేలా సమస్యలు ప్రభావితం చేయవచ్చు. అలాంటప్పుడు ఆ తల్లి  ఏమి చేయాలి ఎలా తన బాధలను, భావాలను కంట్రోల్ చేసుకోవాలి అన్న దాని గురించి మేదావులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు సహజం. అలాంటప్పుడు వాటిని అధిగమించడానికి సిద్దంగా ఉండాలి కానీ, అవి రాకూడదు అని కోరుకుంటూ నిస్సహాయ స్థితిలో ఉండి పోకూడదు. ముఖ్యంగా తల్లి ఎప్పుడూ కూడా తమ పిల్లలకు మార్గదర్శకంగా మెలగాలి. డైరీ రాయడం అలవాటు చేసుకోండి, అయినా చెడు అయినా కష్టమైనా నష్టమైనా, బాధాకరమైన విషయాలు అయినా అందులో రాయడం అలవాటు చేసుకోవాలి. అలా ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే రోజువారీ పనులను కూడా అందులో రాసుకోవడం వలన క్రమం తప్పకుండా చేయవచ్చు.
అదే విధంగా స్నేహితులతో లేదా సన్నిహితులతో మీ బాధను పంచుకోవడం అలవాటు చేసుకోండి అపుడు మీ ఒత్తిడి తగ్గుతుంది.
అలాంటప్పుడు మీ పిల్లల ముందు మీ కోపాన్ని, అసహనాన్ని లేదా ఆవేదనను వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రాదు.  
అలాగే మీ పిల్లలు పరిస్థితిని అర్దం చేసుకోగల పెద్దవారు అయితే వారికి విషయాలను చెప్పడమే మంచిది. వారికి అర్దం అయ్యేలా చెప్పడం మంచిదే. అలాగే మీకు భరించలేనంత బాధ కలిగినప్పుడు దాన్ని పిల్లల ముందు వ్యక్తం చేసే దానికన్నా... ఆ ఒత్తిడి తగ్గే వరకు వారికి కొంత దూరంగా ఉండటం మంచిది. అందుకే తల్లులు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: