అమ్మ: దాల్చిన చెక్కను తీసుకుంటే.. గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?
సాధారణంగా దాల్చినచెక్క వెచ్చగా ఉండటంతో దానిని టీ, డిటాక్స్ డ్రింక్స్, సూప్‌లు, కూరలు, డెజర్ట్‌లలో దీన్ని జోడించడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే రక్త ప్రవాహాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే మహిళలు ఆహారంలో కొద్ది మొత్తంలో దాల్చినచెక్కను జోడించడం వల్ల క్రమరహిత ఋతు చక్రాలను నిర్వహించడంలో దోహదపడుతుంది. ఇక పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ప్రభావాన్ని తగ్గిస్తుంది.
అంతేకాదు.. ఉదయాన్నే దాల్చిన చెక్క టీ లేదా దాల్చిన చెక్క డిటాక్స్ వాటర్ తాగడం వల్ల రుతు చక్రాలను క్రమబద్ధీకరించడంలో తోడ్పడుతుంది. అలాగే గర్భధారణ అవకాశాలను పెంచడంలో దోహదపడుతుంది. ఇక దాల్చిన చెక్కను రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో ఒక్కసారి చూద్దామా.
అయితే ఆరోగ్య నిపుణులు వివరాల ప్రకారం.. పురుషులు లేదా మహిళలు తమ రోజువారీ ఆహారంలో దాదాపు 3 గ్రాముల దాల్చిన చెక్కను తీసుకోవచ్చు. ఇక దాల్చినచెక్క సంతానోత్పత్తికి గొప్పగా పనిచేయడమే కాకుండా బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నిర్వహించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అయితే దాల్చిన చెక్కను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అంటున్నారు. ఇక దాల్చిన చెక్క బెరడు లేదా స్టిక్‌ను వేడి నీటిలో వేసి టీగా తాగడం లేదా సలాడ్‌లు, ఓట్ మీల్స్, గంజి, సూప్, స్మూతీస్‌పై దాల్చిన చెక్కను తీసుకోవచ్చు అని అంటున్నారు.