
అమ్మ: గర్భిణీలు గుడ్డు తింటున్నారా.. అయితే జాగ్రత్త సుమీ..!!
గర్భిణీలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారంలో గుడ్డు ఒక్కటి. అయితే గుడ్డులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. గర్భిణీ మహిళలు గుడ్డు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. గుడ్డులో పోషక విలువలు ఎక్కువగా ఉన్నపటికీ గర్భిణులు ఎందుకు గుడ్డు తినకూడదో ఒక్కసారి చూద్దామా. వాస్తవానికి గర్భిణీ స్త్రీలకు కూడా గుడ్డు మంచిదే అయ్యినప్పటికీ.. పచ్చి గుడ్డును మాత్రం పొరపాటున కూడా తీసుకోరాదని చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు పచ్చి గుడ్డును తీసుకోవడం వల్ల.. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా గర్భిణీ స్త్రీలల్లో కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక గర్భధారణ సమయంలో మహిళలు చేపలను తీసుకుంటే.. కడుపులోని శిశువు ఎదుగుదలకు అవసరం అయ్యే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి.
ముఖ్యంగా ప్రెగ్నెసీ మహిళలు అపరిశుభ్రమైన నీటిలో పెంచిన చేపలను, సముద్రపు చేపలను అస్సలు తినకూడదు. తినకుండా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే.. వీటిలో పలు రకాల కెమికల్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కవేళ గర్భిణులు అలాంటి చేపలను తింటే.. గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. అలాగే గర్భిణీ మహిళలు బొప్పాయి, నిల్వ పచ్చళ్లు, ఉడకని మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, నూనెలో వేయించిన ఆహారాలు, పంచదార, పంచదారతో తయారు చేసిన స్వీట్స్, పచ్చి కూరగాయలు, కాఫీ వంటి వాటిని తినకూడని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.