అమ్మ: ఈ సమస్యతో తండ్రి కాలేక పోతున్నారా.. ఇలా చేయండి..!!

N.ANJI
పెళ్ళైన ప్రతి జంట పిల్లలను కావాలని కోరుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది పిల్లలను ఇప్పుడే వద్దు అనుకోని దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. మరికొంత మంది వాళ్లలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో.. ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీలో కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే.. చదివేయండి. ఇక పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లవంగం తినడం వల్ల మీ స్పెర్మ్ కౌంట్ సమస్యకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే లవంగాలు చాలా ప్రయోజనకరమైనదని అందరికి తెలిసిన విషయమే. లవంగం వీర్య కణాల సంఖ్యను పెంచడంతో పాటు జీర్ణక్రియ సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టడంలో ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు.. లవంగంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం మరియు జింక్ సమృద్ధిగా లభిస్తాయి. అవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహద పడుతాయి.
ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు లవంగాలను క్రమం తప్పకుండా తీసుకుంటే, మీ స్పెర్మ్ కౌంట్‌కు సంబంధించిన సమస్యకి చెక్ పెట్టొచ్చునని చెబుతున్నారు. అంతేకాదు.. లవంగాలు తినడం వల్ల మీ స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తాయని తెలిపారు. అయితే లవంగాలను పరిమిత పరిమాణంలో తినాలని మీరు గుర్తుంచుకోవాలని అన్నారు. పరిమితి కంటే ఎక్కువగా లవంగాలను తీసుకుంటే.. మగ హార్మోన్ టెస్టోస్టెరాన్‌ను ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
అంతేకాదు.. లవంగని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 2 లవంగాలు తింటే, మీ కడుపు సంబంధిత సమస్య నయం అవుతాయని చెప్పుకొచ్చారు. ఇక లవంగం జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుందని, అది అజీర్ణానికి కారణం కాదని అన్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో 2 లవంగాలు వేసుకుని తాగితే.. అది మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహద పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: