చలికాలంలో పిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వాలి.. లేకుంటే?

Satvika
చలికాలంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జబ్బుల బారిన పడతారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..ఇక పిల్లల విషయం లో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి ఇమ్మ్యునిటి పెరిగే ఆహారాలను ఇవ్వాలి. లేదంటే ఎన్నో అనారొగ్య సమస్యలు బాధించవచ్చును. వాటి నుంచి మళ్ళీ రికవరీ అవ్వాలంటే చాలా రోజులు పడుతూంది. ముఖ్యంగా ఈ చలికాలంలో ఎటువంటి పొషకాలు ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కూరగాయలు..

ప్రతి విటమిన్ కరెక్ట్ గా అందాలంటే కూరగాయలను ఎక్కువగా తీసుకొవాలని నిపుణులు చూసిస్తున్నారు. కూరగాయలలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఈ సీజన్ లో దొరికేవి మంచిది. దుంపలు ముఖ్యంగా ఇవ్వాలి. పోషకాహార లోపాలు రాకుండా ఉంటాయి.ముల్లంగి, క్యారెట్లు, బచ్చలికూర, బీన్స్,ఆలు ఉడికించి పెట్టడం ఉత్తమం.


ఒమెగా-3 ఫ్యాటి ఆమ్లాలు..

ఈ కాలం లో శరీరం లో తేమ శాతం తగ్గి చర్మం పొడిగా మారుతుంది. అంతేకాదు చర్మ సంబంధిత రోగాలు కూడా వస్తాయి.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శిశువు చర్మ సమస్యను పరిష్కరిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు పిల్లల్లో జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తాయి.వెజిటబుల్ ఆయిల్, వాల్‌నట్స్, చియా సీడ్స్,సాల్మన్ లను ఇస్తే ఇటువంటి సమస్యలు తగ్గిపోతాయి.


విటమిన్లు.. 

చర్మ సమస్యల నుంచి బయట పడాలంటే విటమిన్ సి అవసరం. గొంతు సమస్యలను తగ్గించాలి అంటే ఈ విటమిన్ పిల్లలకు చాలా అవసరం.నారింజ, బచ్చలికూర, బంగాళదుంపలు, బ్రోకలీ, కివీ, బెర్రీలు మొదలైన వాటిలో ఈ విటమిన్ పుష్కలంగా  ఉంటుంది.. ఈ కాలంలో లభించే కూరగాయలు, పండ్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.


పాల ఉత్పత్తులు..

శరీరానికి కావలసిన కాల్షియం, మెగ్నిషియం అందాలి అంటే పాల ఉత్పత్తులను ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి. అది కూడా గొంతు సమస్యలు లేకుంటే వీటిని ఇవ్వొచ్చు. ఒకవేళ ఇలాంటి సమస్యల తో బాధపడుతుంటే వీటికి దూరంగా ఉండటం మేలు.

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహరాన్ని తరచూ ఇవ్వాలి. ఇకపోతే ఈ కాలం లో స్వీట్స్ వంటి తీపి పదార్ధాలకు దూరంగానే వుంటే బెస్ట్. తీపి పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.  అథి చిన్న వయసులోనే మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ పెరగడం సమస్యలు బాధించవచ్చును. గ్రిల్ చేసిన ఆహారాలను ఇవ్వకపోవడం చాలా మంచిది.కొలెస్ట్రాల్ మరియు కేలరీలు ఉంటాయి, ఇది పిల్లల రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఆయిల్ ఎక్కువగా వాడే వాటికి దూరంగా ఉంటే బెస్ట్..


ఇదండీ చలికాలంలో పిల్లలకు ఇవ్వాల్సిన, ఇవ్వకూడిన ఆహారపదార్థాలు..ఇవి గుర్తుంచుకొని తల్లులు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యం చలికాలంలో బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: