
ఒక పక్క బిడ్డ బాధ్యత... మరో వైపు చదువు చివరికి?
ఆమె పేరు అను కుమారి... హర్యానా రాష్ట్రములోని ఒక పల్లెటూరు. ఈమెకు అప్పుడే పెళ్లయి ఓ కుమారుడు ఉన్నారు. అను భర్త ఒక వ్యాపారస్తుడు , ఈమె విద్యాబ్యాసం చూసుకుంటే బీఎస్సీ తో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేసింది. 2016 వ సంవత్సరంలో జరిగిన సివిల్స్ పరీక్ష లో పాల్గొన్నారు. అయితే ఒక్క మార్కు తేడాతో ఐఏఎస్ అయ్యాయి అవకాశాన్ని కోల్పోయింది ఈమె. అయినా పట్టు వదల్లేదు. ఇటీవల జరిగిన సివిల్స్ లో రెండవ ర్యాంకును అందుకుని అందరినీ అబ్బురపరిచింది. ఈమె ఉన్న గ్రామంలో ఎటువంటి వసతులు లేకపోయినప్పటికీ ఎంతో శ్రమించి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు.
ఒకవైపు ఇల్లు, కొడుకును చూసుకుంటూనే సివిల్స్ కు ప్రిపేర్ అవడమంటే ఎంత కష్టమో ఊహించగలం. కానీ ఈమె పట్టుదల, శ్రమ ముందు అవన్నీ నిలబడలేకపోయాయి. ఈమె ఐఏఎస్ గా పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఎక్కడకు వెళ్లినా సరే మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈమె విజయం ఎందరికో ఆదర్శం అని చెప్పాలి. పెళ్లి అయితే మన జీవితం అయిపోయిందిలే అనే రోజులు పోయాయి.