మహిళ: పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏదో తెలుసా ?
పెళ్ళయితే చేసుకుంటున్నారు, కానీ పిల్లల్ని మాత్రం వారు సెటిల్ అయ్యాకో లేదా పలు రకాల కారణాల చేతనో లేట్ గా కనాలని ప్లాన్ చేసుకుంటుంటారు. చాలా మంది ఇదే దోరణిలో ఉంటారు. వారి వైపు నుండి ఉన్న బాధ్యతల కోసమో, వారి గోల్స్ కోసమో ఇలా చేయక తప్పదు. ఇంకొందరు తమ పిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసేసి మాకో మనవడినో, మనవరాలినో ఇవ్వండి అంటుంటారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇంతకీ ఒక స్త్రీకి గర్భం ధరించి పిల్లల్ని కనడానికి అనువైన వయసు ఏది అంటే కొందరు నిపుణులు ప్రకారం కొందరికి 18, 20 ఏళ్ల వయసు ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తుంటారు. అయితే 18-22 ఏళ్ల మధ్య వయసు స్ర్తీల యొక్క మానసిక స్థితి అంతగా దృఢంగా లేకపోయే అవకాశం ఉంది. అందరికీ అని చెప్పలేము కానీ చాలామంది ఇలా ఉంటారు. దీనినే మనం మెచ్యూరిటీ లేకపోవడం అని తరచూ అంటాము.
అలాగే మరీ 18,19 వయసు స్త్రీలు అయితే వీరి శరీరంలో గర్భాశయం, అండాశయం పూర్తి స్థాయిలో పరిపక్వత చెంది ఉండవు. అంటే గర్భధారణకు అనువైన వయస్సు కాదని నిపుణుల అభిప్రాయం. అందుకనే ఇంత చిన్న వయసులో అస్సలు పెళ్లి చేయకూడదని అంటుంటారు. ఇక గర్భధారణకు సరైన వయసు 22-28 ఏళ్ల మధ్య అని నిపుణులు అంటున్నారు. ఈ వయసులో గర్భదారణ జరిగితే ప్రమాదాలు, సమస్యలు జరిగే అవకాశాలు చాలా తక్కువని, అలాగే ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మిస్తారని అంటున్నారు. ఇక లేట్ గా పిల్లల్ని కనే వారి విషయానికొస్తే 35 ఏళ్ల వయసు నుండి స్త్రీలలో విడుదలయ్యే అండాల సంఖ్య తగ్గుతూ ఉంటుందని చెబుతున్నారు.