అమ్మ: గర్భిణులకు వైరస్‌తో ముప్పు.. ఐసీఎంఆర్ వెల్లడించిన నిజాలివే..!

N.ANJI

కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఫస్ట్ వేవ్ నుంచి ప్రారంభమై.. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో సెకండ్ వేవ్ ముగిసిపోయే దశలో ఉన్నా.. థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకే ఈ మహమ్మారి బారిన పడకుండా వీలైనంత తొందరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారులు సూచిస్తున్నారు.


అయితే కరోనా వైరస్ వల్ల గర్భిణులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయంపై ఇప్పటికీ కొందరికీ స్పష్టత లేదు. ఈ విషయంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వివరణ ఇచ్చింది. ఈ మేరకు కరోనా వైరస్ సోకిన గర్భిణులపై సర్వే నిర్వహించింది. కరోనా వైరస్ సోకిన గర్భిణుల్లో ఇన్ఫెక్షన్ స్థాయి మధ్యస్థం నుంచి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. సాధారణ మహిళతో పోల్చితే గర్భిణుల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.


కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు పాజిటివ్ వచ్చిన గర్భిణుల్లో వచ్చే సమస్యలపై ఐసీఎంఆర్ పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధనలో దాదాపు 4,203 మంది గర్భిణుల సమాచారాన్ని సేకరించింది. ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలపై అధ్యాయనం చేసింది. వీరిలో 13 శాతం గర్భిణుల్లో ఇమ్యూనిటీ లక్షణాలు సాధారణంగా ఉన్నట్లు గుర్తించింది. 384 మందిలో తక్కువ ఇమ్యూనిటీ లక్షణాలు ఉన్నట్లు.. 112 మందికి మధ్యస్థంగా ఉన్నట్లు పేర్కొంది. కేవలం 40 మంది గర్భిణుల్లో మాత్రం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 4,203 మందిలో దాదాపు 77 మంది గర్భిణులకు గర్భస్రావం అయిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. 6 శాతం వరకు కరోనా వైరస్ వల్ల గర్భిణులకు హాని ఉంది. అందుకే కరోనా వైరస్ బారిన పడిన గర్భిణులు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: