మహిళా మేలుకో... నీ శక్తి తెలుసుకో ?

VAMSI
నేడు ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజులో ఎన్నో అత్యాచారాలు మరియు హత్యలు మహిళలపై జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చట్టాలను అమలులోకి తీస్తున్నా ఏ ఒక్క నేరస్తుడు భయపడడం లేదు. పైగా ఇంకా ఎక్కువగానే నేరాలు జరుగుతున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈ అన్యాయాలను ఇంకా ఎవరో వచ్చి ఆపుతారు లేదా ఇలాంటి దుర్మార్గులు చేయడం ఆపేస్తారు అని కలలు కనడం మానేయండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. మీ శక్తి మీరు తెలుసుకోండి. మీ శక్తి మేర పోరాడండి. అందుకు తగిన విధంగా మీ ప్రవర్తనలో మీ ఆలోచనా విధానంలో కొన్ని మార్పులు చేసుకోండి.
ఒక మహిళగా అందరూ ఇంట్లోనే ఉండడం వీలు కాదు. చాలా మంది ఈ రోజుల్లో పురుషులతో సమానంగా బయట ఉద్యోగాలకు వెళ్తూ తమ జీవితాలను సాగిస్తున్నారు. అయితే మీరు బయటకు వెళ్ళే సమయంలో మీ మొబైల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ వాడే విధానాన్ని తెలుసుకోండి. మీకు ఇబ్బంది కలిగే సమయం వస్తే ఆ యాప్ ద్వారా పోలీసులకు సమచారాన్ని అందించండి. ఈ యాప్ ద్వారా ఇప్పటికే చాలా మంది మహిళలు రక్షింపబడ్డారు.
ఎవ్వరికీ భయపడకండి. మీరు భయపడితే అదే వారికి మరింత దైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏ మాత్రం భయపడకుండా వారికి ఎదురు తిరగండి. ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు ఒక్క దుర్మార్గుడుని ఎదుర్కొన్నా చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇకపై మహిళలపై జరిగే ఈ ఆకృత్యాలకు చరమగీతం పాడండి. నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దుర్మార్గాలను అరికట్టండి. మీ వలన ఒక్క నేరస్థుడు భయపడినా లేదా ఆ నేరస్థుడు పట్టుబడినా కనీసం అతడి బారి నుండి ఒక్కరైనా తప్పించుకున్నట్లే. కాబట్టి ఆలోచించండి దైర్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: