పుట్టింటి 'ముక్కు'పుడక .. భర్త చేతిలోకి ..

Chandrasekhar Reddy
లోకంలో ఎన్నో విచిత్రాలు చూసినా ఎప్పటికి చూస్తూనే ఉండాలి అనిపించేది మాత్రం బార్యాభర్తల మధ్య గొడవలు. అసలు ఎందుకు గొడవలు మొదలవుతాయో తెలుసుకుంటే ఇంకా ఆసక్తిగా ఉంటుంది. అది ఎంత చిన్నదై ఉంటుందంటే, దీనికోసం కూడా గొడవ పదోచ్చా అని అనిపించక మానదు. సరదాగా ఉన్నప్పటికీ, ఈ కేటగిరీలోకి రాని కొందరు ఉంటారు, వీళ్లు చట్టంలో ఉన్న గృహహింసా కిందకు వస్తుంటారు. వీళ్ళని ఏమనాలో తెలియదు. అసలే అమ్మాయిలు అబ్బాయల నిష్పత్తి తేడాతో లేనివాడు లేక ఏడుస్తుంటే, ఉన్న వాడు అరక్క చస్తున్నాడు అన్నట్టే ఉంది వీళ్ళ పరిస్థితి. నిజమే ఆ సామెత కూడా ఊరికే వచ్చి ఉంటుందా, కొందరు ప్రబుద్దులను చూసి పెద్దలు భవిష్య తరాలకు చెప్పిన నీతి సూత్రాలు అవన్నీ.
భార్య అన్నాక పుట్టింటికి అప్పుడప్పుడు వెళ్లకుండా ఉంటుందా..దానికోసం భర్త అనుమతి ఆడకుండా ఉంటుందా. అదికూడా ఊరికే వెళ్ళరు, ఏదైనా అత్యవసరం అనుకుంటేనే వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలా తన తల్లిదండ్రులు సీజనల్ జ్వరాలతో ఉన్నారని వాళ్ళని వెళ్లి చూసి వస్తాను అని ఓ భార్య ఆమె భర్తను అడిగింది. రెండు రోజులు ఆగు ఇద్దరం వెళ్ళివద్దాము అన్నాడు ఆయన. దానికి ఆమె ఇప్పుడే వెళ్లి వస్తాను అని మొండిపట్టుదల పట్టింది. అది కాస్తా చిలికిచిలికి గాలివాన అయినట్టు మొత్తానికి తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకు వెళ్ళింది. అక్కడే కూరగాయల కత్తి ఉంటె భర్త టక్కున తీసుకోని ఆమె ముక్కు కోశాడట. ఈ తరహా ఎక్కడో విన్నాం కదా, లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేసిన సందర్భం.
ఇదంతా రాజస్థాన్ రాష్ట్రం లోని జోధ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిదంత్రుల ను చూసి వస్తాను అని భార్య భర్తను అడగటం ఆయన రేపుమాపు ఆనందంతో అది గొడవలకు దారితీసిందని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఆ గొడవల్లో క్షణికావేశంలో భర్త ఆమె ముక్కును కోసేశాడు, అది గమనించిన ఇరుగుపొరుగు వాళ్ళు ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు అని అధికారులు చెప్పారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవగానే  సోదరుడు భర్తపై పిర్యాదు చేయించాడు, దీనితో పోలీసులు రంగప్రవేశం చేశారు. భర్త పరారీలో ఉన్నాడు, అయితే ఈ ప్రబుద్దుడికి ఈ హింస మాములే నట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: