హాకీ స్టిక్ ఫెమినిస్టిక్ : సెల్యూట్ దెమ్..

RATNA KISHORE

ఆమ‌నొస్తే కొమ్మ‌ల‌న్నీ కోయిల‌మ్మలు

అని చెప్పాడు వేటూరి

అలాంటి కోయిల‌మ్మ‌లున్న సంబంధిత

రాగాలున్న కాలంలో మీరంతా ఉన్నారు


జేజేలు ప‌ల‌కండి బాధ్య‌త

చెప్పానుగా నేర్ప‌డం బాధ్య‌త నెర‌వేర్చ‌డం ఆద‌ర్శం

ఆద‌ర్శ‌నీయ క్రీడాకారిణుల‌ను చూసి మీ బిడ్డ‌ల‌కు

ఇవే నేర్పండి.. వారి క‌ల‌ల‌ను నేర‌వేర్చి

ఆద‌ర్శ‌నీయ తల్లిదండ్రులు అని అనిపించుకోండి

రియ‌ల్ ఫెమినిజం అంటే చేసి చూప‌డం

చెప్పి చూడ‌డం కాదండి..

పాటిస్తారు కదూ! మేరా భార‌త్ మ‌హాన్



ఆట‌లు పేరెంటింగ్ ను నేర్పుతాయి..కాదు ఆట‌లు స‌త్ప్ర‌వ‌ర్త‌న‌కు దారి చూపితాయి..మ‌ళ్లీ కాదు ఆట‌లు గొప్ప ఆశ‌యాల‌కు కాస్త ఆలంబ‌న ఇచ్చి పంపుతాయి. జీవితాద‌ర్శంను నేర్పిపంపుతాయి..మైదానంలో ఓడిపోతే ఇంత‌టి ఆనందం ఏ దేశం పొంది ఉండ‌దు కానీ ఓడినా గెలిచినా ఈ ఇంటి బిడ్డ‌లు వీరు అని దేశం యావ‌త్తూ గొప్పనైన సంతోషాల‌ను న‌మోదు చేయడం ఈ సారి ఒలంపిక్స్ కు పోయి ఆఖ‌రి వ‌ర‌కూ పోరాటం చేసి వ‌చ్చిన మ‌హిళా హాకీ జ‌ట్టు చేసిన కృషికి సంకేతం. ఆ నేప‌థ్యంలో ఫేస్బుక్ మాధ్య‌మం కూడా ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌తి డిజిట‌ల్ మాధ్య‌మం కూడా వీరి విజ‌య ద‌ర‌హాసాల వెనుక ఉన్న విశ్వాసాన్నీ న‌మ్మ‌కాన్నీ ఏదో ఒక విధంగా విశ్లేషిస్తూనే ఉంది.. అందుకు త‌గ్గ ప‌దాల‌ను కాదు గొప్ప భావాల‌ను జోడించి చెబుతోంది.. చాలా కాలానికి బాధ్య‌త‌గా ఉన్న మీడియా ఒక‌టి వెలుగు చూస్తోంది. వీరి విష‌య‌మై.. వీరిని  పాజిటివ్ గానే ట్రోల్ చేస్తున్నారు.. అది కూడా అభినంద‌నీ య‌మే.. మాకు కావాల్సింది బేలత‌నం కాదు బోలుత‌నం కాదు ఇలాంటి ధైర్యం నిండిన తెగువ నిండిన బిడ్డ‌లు అని చెబుతూ మాట్లాడుతోంది.. రియ‌ల్ పేరెంటింగ్ కు ఇది ఒక తార్కాణం అని చెబుతోంది. ఇంకా విశ్లేషిస్తే...ఈ త‌ర‌హా సామాన్యుల విజ‌యాల‌ను, పేరెంటింగ్ క‌ల్చ‌ర్ ను అల‌వ‌రుస్తుందో గ్రూప్..ఈ క‌థ‌నం రాసేందుకు స్ఫూర్తి కూడా ఆ గ్రూపు నిర్వాహ‌కులే! 




ఇటువంటి విజ‌యాల‌ను,ఇటువంటి సామాన్య స్వ‌రాల‌ను ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాదు వారి జీవితాల‌కో మంచి మ‌లుపు తిప్పేం దుకు కృషి చేస్తోంది జింద‌గీ ఇమేజెస్ గ్రూపు.ఈ గ్రూపును న‌డిపించే వాడు ఒక‌డున్నాడు. ఆ య‌న పేరు చేగొండి చంద్ర‌శేఖ‌ర్ .. జీవి తాన్ని అర్థం చేసేలా కాదు అర్థం చేయించేలా చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా రెండు ల‌క్ష‌ల మంది చేస్తున్న ప్ర‌య‌త్నం ఎఫ్బీలో..! వీ రంతా త‌మ దైనందిన జీవితంలో భాగంగా ఎదుర‌య్యే ప్ర‌ తి  అంద‌మ‌యిన అనుభవాన్నీ,బాధ‌నూ చెబుతారు. అంతేనా! జీవితా న్ని అర్థం చేయించ‌డం అంటే త‌న‌లో క‌ళనూ, మ‌నిషినీ త‌న‌తోటి మ‌నిషిలోని క‌ళ‌నూ, అర్థాన్నీ అన్నింటినీ చేరువ చేయ‌డం.. అని నిరూపిస్తారు. ఈ ప‌ని కార‌ణంగా దేశం బాగుప‌డుతుంది అ న్న న‌మ్మ‌కం ఒక‌టి ఉంది..వారిలో..ఆ న‌మ్మ‌కంతోనే మహిళా హాకీ క్రీ డాకారుల‌ను నెత్తిన పెట్టుకుంటోంది.. ఈ రోజు ఒలంపిక్స్ వెళ్లిన నాటి నుంచి అంద‌రిలోనూ ఉత్సాహం.. వెళ్లి వ‌చ్చాక కూడా ఉత్సా హం..ఆనందం తారా స్థాయికి చేరిన వైనం ఇది.. ఇక ఫెమినిజం ఏముందో చెప్తాను..



ఒలంపిక్స్ వెళ్లే వ‌ర‌కూ షారుఖ్ మాట్లాడాడా తెలియ‌దు..ఒలంపిక్స్ కు వెళ్లే వ‌ర‌కూ ఆ కోచ్ అయినా మాట్లాడాడా..తెలియ‌దు కానీ వెళ్లి వ‌చ్చాక ఈ దేశం ఆ జ‌ట్టు నిబ్బ‌రాన్ని మెచ్చుకుంటుంది. ధైర్యంతో చేసిన ప్ర‌యాణంలో వ‌చ్చిన ఒడిదొడుకుల‌ను చూసి చేయి ప‌ట్టి న‌డిపిస్తాం మీ తోడు మేం అని అంటోంది. మ‌న సినిమాల‌లో క‌నిపించే ధైర్యం వేరు వీరు చేసే లేదా చూపించే హీరోయినిజం కాదు క‌దా కావాల్సింది.. త‌ల్లీ తండ్రీ ఈ బిడ్డ‌ల‌ను చూసి నేర్పుతున్న కొన్ని పాఠాలు ఇవాళ  ఎప్భీ వేదిక‌గా చూశాను.. అవును! ఇది మ‌నంద‌రి విజ‌యం..మ‌న ద‌ర్శ‌కులు వీలుంటే బ‌యోపిక్ తీస్తారు కానీ నిజ జీవితంలో వారి క‌న్నీళ్లు తుడుస్తారా చెప్పండి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: