భర్త వీర్యం కోసం కోర్ట్ కి ఎక్కిన మహిళ

Mamatha Reddy
తన భర్త వీర్యాన్ని ఇప్పించాలని ఓ మహిళ కోర్టుకు వెళ్లడం ఇప్పుడు దేశంలోనే సంచలనం సృష్టిస్తుంది. ఆయన చనిపోయినా అతని పిల్లలకు తల్లి గా ఉండాలని ఆశ పడుతున్న అనే ఆమె కోరికను ప్రభుత్వ తీరుస్తుందో లేదో తెలియదుగానీ నా భర్త వీర్యాన్ని నాకు ఇప్పించండి అంటూ ఆమె కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు దేశమంతటా సంచలనం సృష్టిస్తోంది. ఓ పక్క ఆమె భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోపక్క ఆయన వీర్యం కావాలని భార్య పోరాడుతోంది. నాకు వీర్యం వచ్చేలా  చేయండి మీ మేలు మర్చిపోలేనని మహిళ న్యాయస్థానాన్ని కోరుతుంది.

దీనికి అత్తమామలు కూడా ఆమెకు అండగా నిలుస్తూ ఉండడం గమనార్హం. భర్తను కాపాడుకోవడానికి అలనాటి సావిత్రి తన భర్త పిల్లలకు తల్లిని కావాలని యమధర్మరాజుతో పోరాడి తన భర్త ను కూడా కాపాడుతుంది. ఇక్కడ కరోనా యముడి తో పోరాడుతుంది నవతరం సావిత్రి.  తన భర్త ప్రాణాలతో బయటపడతాడో లేదో తెలియదు కానీ భార్య తన భర్త పిల్లలకు తల్లి కావాలి అని కోరుకుంటుంది. అందుకే కరుణ మహమ్మారి తో పోరాడుతున్న తన భర్త వీర్యాన్ని ఇప్పించి మేలు చేయాలని గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు ఆశ్రయించింది ఓ యువతి.

గుజరాత్లోని అహ్మదాబాద్ లో 29 ఏళ్ల యువతి భర్తకు కరోనా సోకింది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద చావు బతుకుల మధ్య వున్నాడు. ఒక రోజు నుంచి అతను బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె గుండె బద్దలై పోయింది.భర్త తో పాటు పిల్లా పాపలతో  సంతోషంగా జీవించి నివసించాలని భావించిన ఆమె ఆశలు అడియాసలు చేసింది కరోనా. కానీ తన భర్త పిల్లలతో తల్లిని అయ్యి జీవితాంతం సంతోషంగా ఉండాలని భావించిన ఆమె ఈ విషయాన్ని అత్తమామలతో చెప్పగా వారు కూడా చలించిపోయి కోడలిని తమ కూతురు గా భావించి అండగా నిలిచారు. ఈ క్రమంలో అత్తమామలతో కలిసి ఆమె హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. నా భర్త కరోనా తో పోరాడుతూ ఉన్నాడు. బతికే అవకాశం లేదు. దాంతో నా భర్త చనిపోయిన అతని పిల్లలకు తల్లిగా మారాలని కోరుకుంటున్నానని అతని వీర్యాన్ని భద్రపరచి నాకు వచ్చేలా చేయాలని ఆమె కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: