అందంతో కి'లేడీ' వల.. ఏకంగా కమిషనర్ ని రంగంలోకి

Mamatha Reddy
సోషల్ మీడియా ను అందరూ మంచికే వాడరు కొందరు చెడుకు కూడా వాడుతూ ఉంటారు. దాని ద్వారా ఏదో ఒక విధంగా వారు లాభపడడమే కాకుండా ఎదుటివారిని నష్ట పరుస్తారు కూడా.  ఆ విధంగా చాలామంది ఇప్పటివరకు సైబర్ నేరాలకు పాల్పడి చట్టానికి దొరక్కుండా తప్పించుకొని తిరగలేరు అన్న విషయం గమనించరు. అలా సైబర్ నేరాలు చేసి ఎంతోమంది దొరికిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఏ సెలబ్రిటీ అయి ఉంటుందని అందరూ అనుకోవచ్చు. నిజంగా ఆమె సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ అని చెప్పాలి. లక్షల్లో ఫాలోవర్స్ ఉండడంతో ఆమె ఏం చేసినా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది.

చూడడానికి అందంగా ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి కాబట్టి ఆమె మంచిది అని అనుకుంటే పొరపాటే. డిఫరెంట్ స్టైల్స్ లో సన్ గ్లాసెస్ పెట్టుకొని ఒకసారి, లిప్ స్టిక్ పెట్టుకుని ఒకసారి అందరినీ  కట్టిపడేస్తున్న ఈమె తాను ట్రాఫిక్ పోలీస్ నని , పోలీస్ కమిషనర్ సౌమిత్ర తన తండ్రి అని చెప్పుకుంటూ ఇన్ని రోజులు వచ్చింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈమె పేరు సులగ్న ఘోష్. సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక అందులో తన ఫోటోలను పోస్ట్ చేయడం జనాలు ఆకర్షించడం మొదలుపెట్టింది. ట్రాఫిక్ పోలీసు గా ఉన్నతాధికారిగా తనని పరిచయం చేసుకుంటుంది. నెటిజన్స్ కు కూడా ఆమె నిజంగానే ట్రాఫిక్ పోలీస్ అని చాలామంది అనుకున్నారు.  అలాగే అందంగా కూడా ఉండడంతో క్రేజ్, ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇటీవలే తన అకౌంట్ నుంచి ఆమె ఫోటోలు తొలగించగా అనుమానం వచ్చిన కోల్ కతా యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో ఆమె ఇలాంటి పోస్టులు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  మరి దేని కోసం ఆమె ఈ విధంగా చేసిందని విచారణ జరుపుతున్నారు. సులగ్న ఎవరిని మోసం చేసినట్లు ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: