ఈ హీరో కు అమ్మ అంటే ఎంత ప్రేమో..!!

Mamatha Reddy
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అమ్మ అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. చాలా సందర్భాలలో వారి వారి తల్లుల పై ఉన్న ప్రేమను ప్రేక్షక లోకానికి చాటి చెప్పారు. పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా తమ తల్లుల గురించి వారి గొప్పతనం గురించి చెప్పడంలో వారు ఎంతో విజయవంతమయ్యారు.  అమ్మ ఎవరికైన అమ్మే. ఎంతటి సాధారణ మనిషి అయిన కొడుకు ని తల్లి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది.  ఆ తల్లి రుణం ఏ విధంగా తీర్చు కున్నాం అనే దాన్ని బట్టి వారి ప్రేమ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఆ విధంగా టాలీవుడ్ లో చాలామంది నటీనటులు తమ తల్లి పై ప్రేమను బహిరంగంగా చాటుకున్నారు. 

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అమ్మ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఎంతో ఇష్టం గా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. ఏ సందర్భంలో అయినా ఎక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే అమ్మ అని ఆయన సమాధానం చెబుతారు. మీ నాన్న తో ఫోటో అడిగితే అమ్మ తో ఉన్న ఫోటో పోస్ట్ చేశారు సాయి ధరమ్ తేజ్.  నాకు నాన్న కూడా అమ్మే అని పరోక్షంగా చెప్పాడు. ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో పాల్గొన్న సాయి తేజ్ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారిని ఎంతో సంతోషపరిచారు.

మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనగా అన్నం పప్పు ఆవకాయ నెయ్యి అప్పడాలు అని చెప్పగా హీరోయిన్ ఎవరు అనగా సమంత, క్రికెటర్ ధోనీ,  చరిత్రలోకి వెళితే ఎవరి పాత్రలో నటిస్తారు అంటే భగత్ సింగ్ అని అని చెప్పారు.  ప్రస్తుతం ఆయన దేవాకట్ట దర్శకత్వంలో లో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకోగా ఇటీవలే ఓ పాటను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: