అమ్మ: గర్భిణీలు వ్యాయామం చేయటం మంచిదేనా..!

N.ANJI
గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తినే ఆహారం పై మనం ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. వీటిని పాటించటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. గర్భధారణ సమయంలో స్ర్తీలు వ్యాయామం చేయటం చాలా మంచింది. ఆరోగ్యం ఫిట్ గా ఉంటుందని వైద్యులు సూచన. క్యాలరీలు లేని ఆహారాన్ని తీసుకోవటం మంచిది కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సుమ.!
గర్భధారణ టైంలో కాన్స్టిపేషన్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఆహారంలో ఫైబర్ ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, ఆకుకూరలు, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి తీసుకోవటం చాలా మంచింది. వీటిల్లో ఫైబర్ ఎక్కువశాతం ఉంటుంది. ఇవి తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ సమస్యలు రావు. గుండెలో మంట అనిపించినప్పుడు ఫ్యాట్ ఉన్న ఆహారం మరియూ బాగా ఫ్రై చేసిన ఆహారం తీసుకోవటం మానేయాలి. కొద్ది కొద్దిగా మాత్రమే ఆహారం తీసుకోవాలి.. ఒకేసారి కడుపునిండా తినటం కూడా మంచిది కాదు.
ఈ జాగ్రత్తలు పాటించటం ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి గర్భిణీలు తప్పక వీటిని ఫాలోఅవ్వాలి. కొందరకి ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంది. గర్భధారణ సమయంలో ఇవన్నీ  సర్వసాధారణం. కాబట్టి హైరానా పడాల్సిన అవసరం లేదు.  ఉదయం లేవగానే నీరసం లేకుండా ఉండాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం మంచిది. అవి తినటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
వీటితో పాటు ఆహారం విషయంలోనూ మంచి డైట్ పాటించాలి. మనం ముందు చెప్పినట్లుగా ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. దానికోసం ఎప్పటికప్పుడు లిక్విడ్ తో కూడిన జ్యూస్లు,  సలాడ్స్ తీసుకోవాలి. గర్భిణీలకు వీటన్నిటితో పాటు  తమ మనసును కూడా హాయిగా ఉంచుకోవాలి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకూడదు. అలా చేస్తే తెలియకుండా ఆయసం, మానసిక కృంగుబాటుకు లోనవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: