గర్బిణీలకు మలబద్ధక సమస్యలు రాకుండా ఏం తింటే మంచిది?

N.ANJI
గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు మరింత సమాచారం తెలుసుకుందాం.. వైద్యులు గర్భిణీల ఫుడ్ డైట్ విషయంలో ఏం చెప్తున్నారంటే.... తీనే ఆహారంలో ఫైబర్ సరిపడా ఉండేలా చూసుకోవాలి. దానివల్ల మలబద్ధకంగా ఉండదు. ఓట్స్, ముడిగోధుములు, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తిన్నా మలబద్ధక సమస్యలు రావు. పండ్లతో చేసిన జ్యూస్ లు ఆరోగ్యానికి ఎప్పడూ మేలు చేస్తాయి. మరీ ముఖ్యంగా క్యారెట్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్ తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు తినటం కూడా ఆరోగ్యానికి మంచిదే.
ఆఖరి సెమిస్టర్ చాలా కీలకం
25-40 వారల్లో గర్భిణీలకు కేలరీలు ఎక్కువగా కావాలి. శిశువు అప్పటికే కొంతమేర ఎదిగి ఉంటాడు. ఈ సమయం నుంచి ఎదుగుదల ఇంకా వేగం అవుతుంది.  కనీసం 300 కేలరీలు అయినా కావాలి. రోటీలు, ఇడ్లీలు రెండు చొప్పున తినాలి. ఇంకా కప్పు సాంబార్ తో కూడా ఈ కేలరీలు అధికంగా ఉంటాయి. మహిళకు ఉపవాసాలకు ప్రాధాన్యం ఇస్తారు. అలా అని గర్భిణీగా ఉన్న సమయంలో కూడా ఉపవాసాలు చేయటం మంచిది కాదు.  శరీరానికి  పోషకవిలువలు నిరంతరం అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఉపవాసల పేరిట కడుపుమాడ్చుకోవటం ఆరోగ్యానికి ప్రమాదం. సరైన పౌష్టికవిలువలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడే శిశువు ఆరోగ్యంగాను బలంగానూ ఉంటారు. అప్పుడే ఎదుగుదల బాగుంటుంది.
బాదంపాలు, ద్రాక్ష జ్యూస్, క్యారెట్ జ్యూస్, బటర్ మిల్క్ తరచూ తీసుకుంటూ ఉండాలి. వీటిల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు ఖర్జూరాలు, అరటిపండ్లతో షేక్ చేసుకుని కూడా తాగవచ్చు. ఉడికించనవి తీనటం మేలు. అప్పుడే అందులోని విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన ఆలతో టిక్క, గోధమపిండితో దోశ కూడా తినొచ్చు. అప్పాలను స్నాక్ గా చేసుకుని కొబ్బరి చెట్నితో తింటే టెస్టీగానూ హెల్దీగా నూ మంచిదే. బరువు పెరుగుతామనే ఆందోళను పక్కనపెట్టి ఈ ఫుడ్ డైట్ ను జాగ్రత్తగా పాటిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అది వారి ఎదుగదలకు చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: