ఆరు మాసాల బిడ్డను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్ గా సేవలు అందిస్తున్న మహిళ

Mamatha Reddy
నిత్యం మన చుట్టూ ఉండే మహిళలు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. కష్టాల కడలిని దిగమింగుకుంటూ ఉద్యోగం చేసే మహిళలు ఎంతోమంది మనం ఉన్న ఈ సమాజంలో ఉన్నారంటే నమ్మాల్సిందే. పిల్లల కడుపు నింపుకోవడం కోసం కుటుంబ బాధ్యతను తాము తీసుకుని ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ జీవితంతో పోరాడుతున్నారు. ఆ విధంగా ఆరుమాసాల పసిబిడ్డను పక్కన పెట్టుకొని అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తున్న ఓ మహిళ ఎంతో ముందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

ఢిల్లీ నగరం.. 2015 మార్చి.. 6 మాసాల బిడ్డ నా పసి బిడ్డ ను పక్కన పెట్టుకొని ఆంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నా.. సిగ్నల్ పడింది. బండి ఆగింది. నా వైపు దూసుకు వస్తుంది ఓ గుంపు.  వారి చేతిలో ఓ పిల్లవాడు. కాలు విరిగింది. రక్తం పడుతోంది. యాక్సిడెంట్ కేసు. ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అభ్యర్థించారు. క్షణం ఆలస్యం చేయకుండా నిమిషాలలో ఆ పిల్లవాడిని ఆస్పత్రికి చేర్చాను.  కాలు పోయింది. అయితే ఆరోజు డాక్టర్ చెప్పింది ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది. ఇంకాస్త ఆలస్యం అయుంటే ప్రాణాలు పోయేవి.  నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాను. వారికి నా సేవలు ద్వారా తిరిగి ప్రాణం పోసిన.  నా భర్త హిమన్షు తో కలిసి కొన ఊపిరితో ఉన్న అనేక మందిని రక్షించాను. ఇప్పటికీ మా నిత్యకృత్యం ఇదే అని ఆమె చెప్పింది. 

పెళ్లి అయిన నాటి నుంచి మా ఇద్దరి జీవితాలు సేవకే అంకితమై పోయాయి. పేదలకు ఉచిత అంబులెన్సు సర్వీస్ అందిస్తున్నాం. షాహిద్ భగత్ సింగ్ ట్రస్ట్ మాకు కొంత సహకరిస్తుంది. మొదట్లో స్తోమత లేని పేషెంట్లు ఎవరో తెలుసుకోవడానికి చాలా అవస్థలు పడ్డాము. తర్వాత అవగాహన కల్పించడానికి మా వివరములు ఫోన్ నెంబర్లతో పోస్టర్ లు అంటించామ . 20 ఏళ్లుగా మాది విరామం లేని ఉద్యోగం అంబులెన్స్ 1 నుంచి 14 చేరింది. పదిమంది డ్రైవర్లను పెట్టాను. వారు పగలు పని చేస్తారు. రాత్రి నేను మావారు అంబులెన్స్ లను నడిపిస్తాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: