అమ్మ: గర్భిణులు ఆకు కూరలు ఏవి తీసుకుంటే మంచిది..??

N.ANJI
ప్రెగ్నెసీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వారు తీసుకునే ఆహరంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో కూరగాయలు, ఆకురాలు ఏమి తీసుకోవాలి. పప్పు ధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా. తీసుకున్న ఎంత మోతాదులో తీసుకోవాలలో ఒక్కసారి చూద్దామా.
గర్భధారణ సమయంలో మహిళలు పప్పు ధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా ప్రెగ్నెసి సయమంలో గర్భంలోని బిడ్డ నాడీ వ్యవస్థ, మెదడు అభివద్ధికి ఫోలిక్‌ యాసిడ్‌ అవసరమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఫోలిక్‌ యాసిడ్‌ పప్పుధాన్యాల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇక అందువల్ల గర్భిణీలు పలురకాల పప్పుధాన్యాలు తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు. అంతేకాదు.. పేగులకు సంబంధించిన కొన్ని సమస్యలు పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల పరిష్కారం ఇస్తుంది. ఇక విభిన్న రకాల పప్పుధాన్యాలను మార్చి మార్చి తీసుకుంటే మంచిది.
అలాగే బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా వంటివి తినటం చాలా మంచి ఆహారం అని అంటున్నారు. ఇక వీటిలో ఉండే ఫ్యాట్స్, పీచు పదార్ధాలు, విటమిన్లు శిశువు మెదడు పెరుగుదలకు దోహదపడుతాయన్నారు. ఇక బాదం పప్పులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని అన్నారు. ఇక భోజనానికి భోజనానికి మధ్య సమయంలో అంటే ఉదయం 11 గంటలకు గానీ, సాయంత్రం 5 గంటలకు గానీ స్నాక్స్‌గా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక గర్భిణులు ఆకు కూరలు, తాజా కూరగాయల్లో ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా దొరుకుతాయి. ఇక ప్రెగ్నెసీ దాల్చిన మొదటి ఐదు నెలలలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి ఇవి బాగా మేలు చేస్తుంటాయి. అంతేకాక ఈ ఆహారాలు వెన్నెముక, మెదడు ఎదుగుదలకు దోహదపడుతాయి. ఇక బ్రకోలి లో కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ విరివిగా లభిస్తుంది.
అంతేకాదు.. బచ్చలికూర, పాలకూర, వంటి వాటిలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ మంచి చేస్తుంది. అయితే బీట్రూట్‌ రక్త శుద్ధికి తోడ్పడుతుంది. రక్తహీనత సమస్యను నివారిస్తుంది. అంతేకాదు.. శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. ఇక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కీళ్లనొప్పులు, వాపులను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: