50 ఏళ్ళ వయసులో కుకింగ్ క్వీన్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు

Mamatha Reddy
నార్మల్ గా 50 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు కృష్ణా రామా అనుకుంటూ ఓమూల కూర్చోవాలని చాలామంది చెబుతుంటారు. వారు అన్నట్లుగానే ఈ వయసులోని మహిళలు కూడా భగవద్గీత, రామాయణం చదువుకుంటూ మనవళ్లు మనవరాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లల చదువు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్ బాధ్యతలు అప్పజెప్పి మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవాలి అనుకుంటారు మన భారతీయ సాంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. 

జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నారు. యాభై ఏళ్ళ వయసులో బ్లాగును ప్రారంభించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్ గానే కాక పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్,  రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజన్ పర్సనాలిటీ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. భర్త కొడుకు సాయంతో నిషా 2007లో కుకింగ్ బ్లాగును ప్రారంభించి దానిలో వంటలు తయారు గురించి రాసేవారు.

ఆ తరువాత తనే సొంత వెబ్ సైట్ ను పెట్టి తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు ఎలా ఉండాలో రాసి పోస్టులు పెట్టారు. ఆమె వంటలను ఇష్టపడిన అభిమానులు వీడియోలు పెట్టండి మేడం అని అడగడంతో వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇప్పుడు దాకా 1300 పైగా వీడియోలను అప్లోడ్ చేశారు. కుటుంబం 2009లో మార్చింది అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017 లో టాప్ యూట్యూబ్ కి కంటెంట్ క్రియేటర్ అవార్డు అందుకున్నారు ఆమె. అంతేకాక ప్రముఖ మ్యాగజైన్ లు బ్లూమ్ బర్గ్, ఎకనామిస్ట్ , ఇండియాటుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీ ని ప్రచురిస్తూ కింగ్ క్వీన్ గా అభివర్ణించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: