పెళ్లి చేసుకుంటున్న ప్రతి కొడుక్కి తల్లి చెప్పాల్సిన 5 విషయాలు

Mamatha Reddy
కన్న తల్లి , కొడుకు మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..  ప్రతి తల్లికి కొడుకు ఎంత ప్రాణమో ప్రతి కొడుక్కి కూడా తల్లి అంతే ప్రాణం.. అమ్మను ప్రేమించిన వాడు ప్రతి ఆడదాన్ని కూడా గౌరవిస్తాడు అనే విషయం ఎంత నిజమో, అమ్మను ప్రేమించలేని వాడు కూడా ఏ ఆడదాన్ని కూడా గౌరవించ లేడు అన్న విషయం కూడా అంతే నిజం.. అయితే వీరిద్దరి మధ్య కొత్తగా వచ్చే ఒక అమ్మాయి వల్ల వీరిద్దరి రిలేషన్ దెబ్బతింటుందన్న అభద్రత భావంతో ఇప్పుడు జనరేషన్ ఉందని ఓ సర్వే ద్వారా తెలిసింది..
అయితే కొడుకు కన్న తల్లి వయసులో పెద్ద కాబట్టి పెళ్ళి అయిన సమయంలో భార్య గురించి తల్లి ఓ ఐదు ముఖ్యమైన విషయాలు చెబితే ఎలాంటి గొడవలు అపోహలు భార్య భర్తల మధ్య రావని తెలుస్తుంది.. పెళ్లయిన తర్వాత కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య గొడవలు జరిగి దాని వల్ల భారీ మూల్యం చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి.. అలాంటి సమయంలో ఎలాంటి అపోహలు రాకుండా ఉండాలంటే కన్న తల్లి కొడుక్కి ఈ విషయాలు చెప్పాలి..
భాగస్వామి సర్దుకుపోవడం కష్టమైతే ఆ అమ్మాయి కూడా మీ అమ్మ లాగే వేరే ఇంటి నుంచి వచ్చింది అని, అతనిలాగే పెరిగింది అని ఆ తల్లి కొడుకు చెప్పాలి.. చిన్నప్పటి నుంచి సర్దుకుపోవడం అనేది అలాగే కుటుంబ విలువలు నేర్పించాలి.. పెళ్లయిన తర్వాత భార్యకి కూడా తమ తల్లికి, సోదరి కి ఇచ్చినంత విలువ ఇవ్వాలి అని చెప్పాలి.. భార్యకి పనుల్లో సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని పని షేర్ చేసుకోవాలి అని చెప్పాలి.. భార్య అంటే తన కింద కాదు తనతో పాటు సమానమైన వ్యక్తి అని చెప్పి కొడుకు కాపురం ని ఒక మెట్టు పైకి ఎక్కెలా చేయాలి కానీ అనవసరపు గొడవలు రేకెత్తించి వారి కాపురం చెడగొట్టే విధంగా ఆలోచనలు ఏ మాత్రం చేయొద్దు కన్నతల్లి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: