చాణక్య నీతి: ఆ మూడు లక్షణాలు ఉంటే అయితే ఆ స్త్రీ నాయకురాలు అవ్వడం ఖాయం

Mamatha Reddy
ఆడవారు సమాజంపై ఎంతటి ప్రభావం చూపిస్తారో అందరికి తెలిసిందే.. అమ్మగా, భార్యగా,అక్కగా, చెల్లిగా కీలక పాత్ర పోషిస్తూ మగవారి జీవితంలో ప్రత్యేక వ్యక్తులుగా మిగిలిపోతారు..అలాంటి ఆడవారు ఎప్పుడు మగవారి దృష్టి లో చులకన గానే ఉండి పోతుంటారు.. నిజానికి మగవారి కంటే ఆడవారిలోనే ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి.. అలాగే వారిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. అలా చాణక్య నీతి ప్రకారం ఈ మూడు లక్షణాలు ఉన్న స్త్రీలు కుటుంబంతో పాటు సమాజానికి కూడా నాయకురాలు అవుతారట ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వినయం, దయ.. ఈ లక్షణాలు కలిగి ఉన్న స్త్రీకి సమాజములో మంచి గౌరవం లభించడమే కాకుండా, తన కుటుంబాన్ని సరైన దిశలో నడిపిస్తుందట.. ఆమె కుటుంబం యొక్క అన్ని సంబంధాలను సవ్యంగా ఉంచడంలో భర్తకు సహకరిస్తూ ఉందట.. అదేవిధంగా పిల్లలకు మంచి విలువలు నేర్పించడం ద్వారా వారిని మెరుగైన దారిలో నడిపించి ఈ సమాజానికి మంచి పౌరులను అందజేస్తుంది.. మతాన్ని అనుసరించే స్త్రీ కి కూడా నాయకురాలు అయ్యే లక్షణం ఉంటుందట.. మంచి చెడూ ల మధ్య వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవడం తో పాటు స్త్రీ యొక్క ధోరణి ఎల్లప్పుడు సానుకూలంగా ఉంటుందట..
స్త్రీ ఎప్పుడూ తన విధుల నుండి తప్పుకోదు.. అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది.. కుటుంబం మాత్రమే కాకుండా తరాలను తన నడవడికతో ప్రభావితం చేస్తుంది.. ఇలాంటి స్త్రీల లో ఉండాల్సిన మరో లక్షణం సంపద సంచితం.. ఆచార్య చాణక్య సంపదను నిజమైన స్నేహితుడు గా అభివర్ణించారు.. చెడు సమయాల్లో మిమ్మల్ని ఆడుకునే స్నేహితుడు ఇది అని ఆచార్య చాణక్య అంటారు.. సంపదను ఆదా చేసే ఆలోచన ఉన్న స్త్రీ కుటుంబానికి రక్షణ అవుతుంది.. ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న స్త్రీలు తప్పకుండ మంచి నాయకురాలు అవుతారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: