అమ్మ: గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పడు వేయించుకోవాలి..!
అయితే గర్భిణులు ఈ వైరస్ బారిన పడకుండా ఉండేదుకు వ్యాక్సిన్ వేయించుకోలన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గర్బిణీలకు నష్టం జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో ఎటువంటి నిజం ఇదివరకే పలు అధ్యయనాలు వెల్లడించాయి. నిపుణులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు.వ్యాక్సినేషన్ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఇక వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గర్భంలోని ప్లాసెంటాకు హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ పరిశోధనతో గర్భిణులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గర్భం దాల్చిన తర్వాత 9 నెలల సమయంలో ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని నిపుణలు చెబుతున్నారు.
అయితే గర్భంలోని పిండం అవయవాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే.. సుమారు 12 నుంచి 20 వారాల తర్వాత తీసుకుంటే మంచిదని అంటున్నారు. అయినా ఏ నెలలోనైనా వ్యాక్సిన్ ఇవ్వోచ్చని తెలిపారు. ఇక, గర్భం దాల్చిన తర్వాత తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు కుని.. సాధారణంగా తల్లికి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తుంటారు. అయితే అదే సమయంలో కరోనా టీకా కూడా ఇవ్వాల్సి వస్తే.. ఒకేసారి ఈ రెండూ ఇవ్వకూడదు. ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడానికి, కోవిడ్ టీకా ఇవ్వడానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి.