నిండు గర్భంతో ఉన్న కరోనా పై పోరాటం చేస్తున్న మహిళా డి.ఎస్.పి..!!

Mamatha Reddy
కరోనా ను అంతం చేయడానికి భారత దేశంలోని ప్రతి ఒక్క అధికారి తీవ్రమైన కృషి చేస్తున్నారు.. మళ్లీ సెకండ్ వేవ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో గతంలో లాగానే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క అధికారి తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఓ నిండు గర్భిణీ అని కూడా చూడకుండా మహిళ డిఎస్పి కరోనా వారియర్ లా కరోనా తో పోరాడుతుంది.. ఈమె చేసిన పనికి మహిళ లోకమే కాకుండా పురుష లోకం కూడా హ్యాట్సాఫ్ చెప్తుంది.. మండుటెండలనీ సైతం తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం శ్రమిస్తుంది.. ఇంతకీ ఆ మహిళ డిఎస్పి ఎవరు ఇప్పుడు చూద్దాం.
చత్తీస్ ఘడ్ లో డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శిల్పా సాహూ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ లోని దంతేవాడ డివిజన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె నిండు గర్భిణీ.. అయినా కూడా లెక్కచేయకుండా సమాజసేవే ముఖ్యమని చెప్తూ, చేతిలో లాఠీ పట్టుకొని ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, రూల్స్ పాటించాలి అంటూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.. దీన్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది..
స్వయంగా ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్న శిల్పా సాహు  ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేస్తూ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలా రాశారు.. గర్భిణీగా ఉన్నా విధుల్లో తన టీం తో బిజీగా ఉంది శిల్పా సాహు..  అంతే కాదు నిబంధనలు పాటించాలని, లాక్డౌన్ ఉల్లంఘించరాదనీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది..  అంటూ రాసుకొచ్చారు.. ఈ నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.  ఈ సెకండ్ వేవ్ నుంచి ప్రజలను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు పోలీసులు..  మీ వంతు బాధ్యతగా లాక్ డౌన్లోడ్ ఇంట్లోనే ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు..  నెటిజన్లు ఈ నేపథ్యంలో ప్రశంసించారు శిల్పా సాహు నీ..  అలాగే ప్రజల దగ్గర నుంచి కూడా ఆమెకు మంచి అప్లాజ్ వస్తోంది...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: