అమ్మ: పిల్లలు పుట్టకపోవడానికి ఎక్కువ కారణాలు ఇవే..!
ఇక చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. పైగా ఇది అనేక వ్యాధులు రావడానికి కూడా దారి తీస్తుంది. కాని అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఇది ఫెర్టిలిటీ పై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మహిళల్లో పురుషుల్లో కూడా ప్రభావం చూపుతుంది. అయితే పురుషుల తో పోలిస్తే మహిళలు ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి.
అయితే నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడికి సులువుగా గురవుతున్నారు. ఒత్తిడి వల్ల అనేక సమస్యలు వస్తాయి. నిజంగా ఒత్తిడి బాధని పెరిగిస్తుంది. పైగా పనులు కూడా చేయడానికి వీలు లేకుండా చేస్తుంది. అయినా నేటి కాలంలో ఇది అందరి లోనూ ఎక్కువై పోయింది. ఎప్పుడైనా మీరు మీ పార్టనర్ తో కలిసి ప్రెగ్నెంట్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒత్తిడి లేకుండా ఉండేటట్లు మీరు చెక్ చేసుకోండి.
అంతేకాదు.. కాఫీ వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తుందని గమనించండి. చాలా మందికి తెలియదు అయ్యో చిన్న కప్పు కాఫీ ఏ కదా అని పది సార్లు తాగుతూ ఉంటే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏది ఏమైనా కాఫీ అతిగా తాగడం ప్రమాదకరం. సెక్స్ చేయడం వల్ల ఎస్.టి.డి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇది హానికరం. దీని వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తూ ఉంటుంది. అయితే చాలా మందిలో ఇది మొదట ఎఫెక్ట్ చూపుతుంది. కానీ రాను రాను ఇవి తీవ్ర ప్రభావానికి గురి చేస్తూ ఉంటాయి.