జాతీయ అవార్డు దక్కించుకున్న తెలుగు సినిమా మహర్షి..!!

Mamatha Reddy
67 వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 2019 వ సంవత్సరానికి గానూ కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేష్ బాబు నటించిన 'మహర్షి' నిలిచింది.  ఎన్ చంద్ర ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించగా ఉత్తమ నృత్య దర్శకుడిగా మహర్షి సినిమాకి పాటలకు డాన్స్ కంపోజ్ చేసిన రాజు సుందరం ఎంపిక అయ్యారు. అంతేకాదు ఈ చిత్రంతో పాటు నాని నటించిన జెర్సీ సినిమా కి కూడా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు లభించింది.

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి నటించిన మహర్షి సినిమా టాలీవుడ్ రిలీజ్ అయ్యి రికార్డులను నెలకొల్పింది.. అంతరించిపోతున్న వ్యవసాయాన్ని బ్రతికించే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సూపర్ హిట్ లిస్ట్ లలో చేరిపోయింది.. అంతేకాదు ఈ సినిమా కి తప్పకుండా అవార్డు ను అంచనా వేశారు చిత్ర బృందం.. అనుకున్నట్లుగానే ఈ సినిమా కి జాతీయ అవార్డు వచ్చింది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.. ఇకపోతే ఈ సినిమా లో మహేష్ బాబు తర్వాత చెప్పుకోవాల్సిన మరో పాత్ర అల్లరి నరేష్..


ఈ సినిమా కి మెయిన్ పాత్ర అయిన అల్లరి నరేష్ సినిమా ను మలుపు తిప్పే పాత్ర లో నటించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా ని  కమర్షియల్ హంగులతో పాటు మెసేజ్ ను మిక్స్ చేసి తెరకెక్కించాడు. దిల్‌రాజు, సి.అశ్వినీద‌త్‌, పి.వి.పి నిర్మించగా ఈ సినిమా కి జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషపరిచే విషయమని ఆ చిత్ర నిర్మాత దర్శకుడు చెప్పారు.. మీడియా తో ముచ్చటించిన దర్శక నిర్మాతలు సినిమా గురించి పలు విశేషాలు పంచుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..  2019, మే 9న సినిమా విడుదలయి ఘనవిజయం సాధించిన ఈ సినిమా కి వచ్చిన అవార్డుని మహేష్ బాబు కి అంకితం చేస్తున్నాం అన్నారు. మహేష్ బాబు గారు ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని అన్నారు.. చెప్పినట్లుగానే అయ్యింది అని గుర్తు చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: