అమ్మ: తల్లి కాబోయే వారు ప్రాణాయామం చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా..!?

N.ANJI
బిడ్డకు జన్మ ఇవ్వడమనేది స్త్రీల జీవితంలో అత్యద్భుతమైన, ఉద్వేగభరితమైన సంఘటనలలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భధారణకి ముందునుండే యోగా చేయడం వలన గర్భధారణ సమయంలో శారీరకంగా మానసికంగా  ధృఢంగా చురుకుగా ఉండటానికి సహాయపడడంతో పాటుగా మిమ్మల్ని బిడ్డకు జన్మనివ్వడానికి అన్నివిధాలా సిద్ధం చేస్తుంది. డెలివరీ  తర్వాత రోజుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇక కడుపుతో ఉన్నవారు  చాలా చురుకుగా ఉండాలి. అపుడే బిడ్డ ఎదుగుదలతో పాటు తల్లి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది . అయితే తల్లి కాబోయే ముందు  వీటన్నింటి పై తల్లి అవగాహన పెంచుకోవడం అనేది చాల అవసరం అని  అంటున్నారు నిపుణులు. మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండి, ఎలాంటి అనారోగ్యాలు లేకపోతే కనుక  తొమ్మిదో నెల వరకు ఉద్యోగాలు, ఇతర పనులుచేసుకోవడం లో ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ అలా చేసుకోవాలి అనుకున్న వారు మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తప్పకుండా పాటించాలి.
అయితే మొదటిసారి గర్భం దాల్చిన వారు తమకు తాము సమయం కేటాయించుకోవాలి.. ప్రగ్నెంట్ గా ఉన్న సమయంలో సరిగా నిద్రపట్టకపోవడం మరియు అలసిపోయినట్టనిపించడం చాలా సహజం .కాబట్టి  కాబోయే తల్లులు శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామాలు అంటే ప్రాణాయామం మరియు ధ్యానం వంటివి  చేయడం వలన శరీరానికి, మనసుకు ప్రశాంతత చేకూరి మంచి విశ్రాంతి లభిస్తుంది.
అంతేకాదు.. మంచి ఆహారం తీసుకుంటు ఎప్పటికప్పుడు  డాక్టర్ని సంప్రదిస్తూ, అనుమానాలు ఉంటే తీర్చుకుంటూ.. మందులు ఎప్పటికప్పుడు వేసుకుంటూ… మీకు భక్తి  ఉంటే మంచి ప్రవచనాలు ,భక్తి పాటలు వినండి. ఎందుకంటే అవి పాజిటివ్ శక్తిని ఇస్తాయి. లేదు అలా వినడం కష్టం అనుకుంటే మీకు నచ్చిన పాటలు వింటూ ప్రశాంతం గా ఉండండి. ఇలా చేయడం వలన బిడ్డ చాల ఆరోగ్యం గా ఆక్టివ్ గా ఉంటాడు. ఎట్టి పరిస్థితులలో ఆందోళనకు గురికాకుండా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: