అన్ని విషయాలలో చాలా సైలెంట్ గా ఉండే ఉపాసన ..ఆ ఒక్క మ్యాటర్ లో మాత్రం మహాకోపిష్టి..!

Thota Jaya Madhuri
ఉపాసన అంటే సిన్సియారిటీకి మరో మారుపేరు . మెగా కోడలు కాకముందు నుంచే తనకు కొన్ని కట్టుబాట్లు తనకు కొన్ని విధివిధానాలు ఉంటాయి అంటూ అందరికీ తెలిసేలా చేసింది . అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కాబోతుంది అని తెలియడంతో ఉపాసన గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేశారు జనాలు.  ఆ టైంలోనే ఉపాసన మంచితనం కూడా బయటపడింది.  ఉపాసన వేల కోట్ల ఆస్తి ఉన్న సరే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతుంది.


మరీ ముఖ్యంగా హెల్తీ డైట్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది . ఇండియన్స్ ఎలా హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేలా కొన్ని వీడియోస్ లో చెప్తూ వస్తూ ఉంటుంది ఉపాసన . అయితే ఉపాసన చాలా సరదాగా ఉంటుంది . కానీ ఎలాంటి విషయాన్నైనా చాలా ఫన్నీగా చాలా జోవియల్ గా తీసుకునే ఉపాసన ఒక్క విషయాన్ని మాత్రం చాలా చాలా సీరియస్ గా తీసుకుంటుందట . ఉపాసన తన డైటింగ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ఇతరుల డైటింగ్ విషయంలో కూడా అంతే స్ట్రిప్ట్ గా ఫాలో అవుతుందట.


మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ డైట్ కంట్రోల్ ప్లాన్ మొత్తం ఉపాసన చేతుల్లోనే ఉంటుందట . ఏ సినిమాకి అయినా సరే బరువు పెరగాలి అంటే మాత్రం అస్సలు యాక్సెప్ట్  చేయొద్దు అంటూ చరణ్ కి చెప్పేస్తుందట . అంతేకాదు ఎప్పుడైనా రాంచరణ్  చీట్ మీల్ చేసిన ఉపాసనకు భలే కోపం వస్తుందట . అన్ని విషయాలలో చాలా గుడ్  ఉమెన్ గా ఉండే ఉపాసన డైట్ విషయంలో కంట్రోల్ తప్పితే మాత్రం మహా కోపిష్టి బిహేవ్ చేసేస్తుందట.  అయితే ఒకందుకు ఇది మంచిదే అంటున్నారు అభిమానులు . హెల్త్ ఇంపార్టెంట్ . ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీల హెల్త్ ఎలా అనారోగ్యాలకు గురవుతుందో చూస్తున్నాం . ఉపాసన మేడం మా చరణ్ సార్ ని మీరే బాగా చూసుకోవాలి అంటూ మెగా ఫాన్స్ స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: