తమ్ముడి కోసం కష్టపడుతున్న ఓ సోదరి. పెళ్లి సైతం వద్దంటున్న ఆ సోదరి ఇంతకీ వారి కథేంటి?

Mamatha Reddy
మనం కొన్ని సినిమాల్లో అన్న- తమ్ముళ్ల  కథ చూస్తుంటాము. చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన వాళ్ళు ఒంటరిగా పెరిగి పెద్దవడం లాంటివి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. తమ్ముళ్ల బాగోగులు అన్నయ్య చూసుకుంటూ వారికోసం తన జీవితాన్ని వదులుకుంటూ,తమ్ముళ్లు ప్రయోజకులు అయ్యేవరకు వారి ఆలనాపాలనా అన్ని తానై చేయటం లాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాము. అది సినిమా కాబట్టి వాళ్ళు విజయం సాధించినట్లు చూపిస్తారు. కానీ నిజజీవితంలోకి వస్తే సినిమాల్లోలాగా అంత సులువుగా మాత్రం ఉండదు. నిజజీవితం లో కూడా అలాంటి ఒక కథని మీకు ఇప్పుడు  చెప్పబోతున్నాను ఇది అక్క-తమ్ముడి కథ ఇక విషయంలోకి వెళ్తే,
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలానికి చెందిన శ్రీలత,ప్రశాంత్ వాళ్ళ తల్లితండ్రులు చిన్నప్పుడే అనారోగ్యం తో మరణించారు.ఇప్పుడు వాళ్లిద్దరూ అనాధలుగా ఒక షెడ్డు కింద నివాసం ఉంటున్నారు.అయితే శ్రీలతకి కుట్టుపని రావడం తో దానిని ఒక ఉపాధిగా చేసుకొని ఇప్పుడు తమ్ముడి బాధ్యతలను తీసుకుంది. ఇంటర్ తోనే చదువును ఆపేసిన శ్రీలత ప్రశాంత్ ఒక ఉద్యోగం లో స్థిరపడేవరకు చదివిస్తానని చెబుతోంది.
అయితే తల్లితండ్రుల వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసింది. వారి మరణంతో ఆ ఇద్దరు ఒంటరివారైయ్యారు. ఈ క్రమంలో ప్రశాంత్ చదువు కోసం తన జీవితాన్ని శైత్యం త్యాగం చేసింది. ఒకవేళ ఫ్యూచర్ లో తనకి పెళ్లి అయితే ప్రశాంత్ ఒంటరి వాడు అవుతాడని వాడిని చూసుకోడానికి ఎవరు ఉండరని భావించి పెద్దలు తెచ్చిన పెళ్లి ప్రస్తావనని కూడా పక్కన పెట్టేసింది. తమ్ముడికి ఒక ఉపాధి దొరికేవరకు చదివిస్తానని శ్రీలత అంటోంది. తనకి తెలిసిన  కుట్టుపనితో వచ్చిన చిన్నపాటి డబ్బును పొదుపుగా వాడుతూ వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. చిన్న రేకుల షెడ్డులో ఉంటూ ఎండ వేడికి తాళలేక మూడు పూటలా భోజనం కూడా సరిగా చేయలేక చాలా కష్ఠాలు అనుభవిస్తున్నారు ఈ అక్కా తమ్ముడు. అక్క చేస్తున్న కష్టం వృధాపోకుండా బాగా చదివి ఒక మంచి ఉద్యోగం సాధిస్తానని ప్రశాంత్ అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: