రోజా పరువు తీసేసిన నాగబాబు.. కావాలనే అలా చేశాడా..??
ఇక జబర్దస్త్, బొమ్మ అదిరింది షోలతో నాగబాబు చేసిన రచ్చ అంతా ఇంత కాదు..అంతేకాకుండా జబర్దస్త్ షోను వదిలి వచ్చిన సమయంలో అన్ని విషయాలను బయటపెట్టేశాడు. జబర్దస్త్ యాజమాన్యాన్ని ఏకిపారేశాడు. ఇక బొమ్మ అదిరింది షోతో ఏకంగా వైఎస్ జగన్‌పైనే సెటైర్లు వేస్తూ స్కిట్లు చేశారు. దీంతో షోకు మొదటికే మోసం వచ్చింది. ప్రస్తుతం అడ్రస్ లేకుండా షో గల్లంతైంది.అయితే ప్రస్తుతం నాగబాబు మాత్రం సోషల్ మీడియా మీదే ఆధారపడి ఉంటున్నాడు. యూట్యూబ్‌లో కొత్త షోలను ప్రారంభించాడు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. స్టాండప్ కామెడీ అంటూ నాగబాబు చేస్తోన్న ఈ షో బాగానే క్లిక్ అవుతోంది.
నాగబాబు తాజాగా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టాడు. వారు అడిగిన ప్రశ్నలకు వెరైటీగా సమాధానం ఇచ్చాడు. అందులో ఓ భాగంగా ఓ నెటిజన్ జబర్దస్త్‌కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. జబర్దస్త్‌లో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు అని అడిగితే.. రోజా అంటూ నాగబాబు పంచ్ వేశాడు.అయితే జబర్దస్త్‌లో రోజా జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. కానీ ఆమెను కమెడియన్ చేసేశాడు నాగబాబు. ఇలా కావాలనే ఆమె స్థాయిని తగ్గించాడో లేదా.. ఆర్టిస్ట్‌లకంటే ఎక్కువగా పంచ్‌లు వేస్తోందనే ఉద్దేశ్యంతో అలా చెప్పాడా? అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది...!!