ఏపీ చెందిన ఈ అమ్మాయి దేశంలోనే తొలి ఏరోనాటికల్ ఇంజనీర్ గా ఎలా మారింది?

Mamatha Reddy

దేశ రక్షణకి సేవ చేయాలనే ఆశయం అందుకు తగ్గ కఠోర కృషి ఆమెను దేశం లోనే తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్ ని చేసింది. ఇప్పుడు దేశం గర్వించదగ్గ పదవిలో ఆమె సేవలను అందిస్తుంది. మహిళా అనుకుంటే ఏదైనా సాధించగలదు అని ఈ కృష్ణ సాహి మరోసారి నిరూపించింది. తను సాధించిన గెలుపుతో ఒక్కసారి ఎంతో మంది కలలు కనే యువతరానికి కృష్ణ సాహి ఒక మార్గం చూపింది. తన గెలుపుతో వారందరిలో స్ఫూర్తి నింపింది. అలాంటి కృష్ణ సాహి యొక్క జీవిత కథ గురించి ఇందులో తెలుసుసుకుందాం.
గుంటూరు కి చెందిన కృష్ణ సాహి వాళ్ళ తల్లితండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషం. తాను కూడా టీచర్ కావాలని అనుకోలేదు. ఎవరు సాధించలేనిది చేయాలనుకుంది. ఆలా చిన్నప్పటి నుంచీ ఏదైనా సాధించాలనే తపన ఆమెలో ఉండేది. అబ్దుల్ కలాం స్పూర్తితో ఎదగడం మొదలు పెట్టింది. ఆలా పదవతరగతి 90% పైగా సాధించి జాతీయస్థాయి స్కాలర్ షిప్ పొందింది. దానితోనే ఇంటర్ మరియు బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీర్ పూర్తయ్యాక ఓ కంపెనీ లో ఏరో స్పేస్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. ఇది చేస్తూనే ఏరోనాటికల్ ఇంజనీర్ గా శిక్షణ కూడా తీసుకుంది. దానితో పాటుగా యూకే లోని ఎయిర్ బస్ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ లో కొన్ని నెలలపాటు పని చేసింది.
ఆ తర్వాత ఏరోనాటికల్ ఇంజనీర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసింది పరీక్షలు రాసింది. కేవలం ఒక్క మార్కు తేడాతో ఉద్యోగం చేజారిపోయింది. చివరికి బోయింగ్ ఏరోస్పేస్ ఇన్ ఇండియా అనే సంస్థలో ఛాన్స్ కొట్టేసింది. ఈ పోస్ట్ కోసం సుమారు వెయ్యిమందికి పైగా హాజరైతే అందులో కేవలం నలుగురే ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. వారిలో ఒకరే కృష్ణ సాహి. యుద్ధ విమానాలను తయారుచేసే బోయింగ్ సంస్థలో దేశంలోనే తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్ గా ఎంపికైనట్లు సంస్థ నుండి ఉత్తరం రాగానే తన సంతోషానికి అవధులు లేకుండా చేసాయి. ఈ విజయం పట్ల అటు తల్లితండ్రులు మరియు కుటుంబసభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ సాహి బోయింగ్ ఏరోస్పేస్ ఇన్ ఇండియా లో ప్రోడక్ట్ రివ్యూ ఇంజనీర్ గా ఉద్యోగానికి ఎంపిక అయ్యింది. జూన్ 22 న ఆమె విధుల్లోకి చేరనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: