జయలలిత గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఇవే..!?

Mamatha Reddy

తమిళనాడు రాజకీయంలో సంచలనం సృష్టించిన మహిళ నేత. ఇటు సినీ రంగంలోనేకాక, అటు భారత రాజకీయాల్లో చెరిగిపోని ముద్రవేసిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. జయలలిత జీవితం ఒడిదుడుకులమయం. ఎన్నో ఉత్తానపతనాలను చవిచూసింది. మరెన్నో కష్టనష్టాలను అనుభవించింది. అయితే అన్నింటిని ధైర్యంతో ఎదుర్కొంది. సినిమా హీరోయిన్ గా జీవితం ప్రారంభించి 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. ఆమె తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత. నేటితరం రాజకీయ నాయకులకు మార్గదర్శకురాలిగా మారింది.
తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలుకాలోని మెల్కొటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. జయలలిత తల్లి పాత చిత్రాలలో ప్రముఖ నటిగా పేరు పొందారు. జయరాం తాతగారు మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పని చేశారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చెన్నై కేంద్రంగా ఉన్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. ఆ సమయంలో వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది.
జయలలిత చిన్న వయసులోనే సినిమా రంగానికి పరిచయమైంది. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. అనతికాలంలోనే అగ్రహీరోల సరసన నటించింది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చిలన చిత్ర పరిశ్రమలో ఎనలేని ఖ్యాతి సంపాదించింది. అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది. అక్కడితో ఆమె గ్రోత్ ఆగిపోలేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఎంజీఆర్ వారసురాలిగా అన్నాడీఎంకే పార్టీ కోసం శ్రమించింది. రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.
అయితే 1987లో రామచంద్రన్ మరణించటంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు.1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.1989లో బొడినాయక్కనూర్ నుంచి ఏఐఏడీఎంకే తరపున శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. సభలో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు. 2016లో వరుసగా ఏఐడిఎంకేను అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఆ అధికారం పూర్తిగా అనుభవించకుండానే 5 డిసెంబర్ 2016లో అభిమానులను శోక సంద్రంలో ముంచి ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: