అమ్మ: గర్భం ధరించిన మొదటి 3నెలలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..!?
ఇక మార్నింగ్ సిక్ నెస్ (కడుపులో తిప్పడం, నీరసంగా ఉండటం, వాంతి వచ్చేట్లు ఉండటం) ఉన్నట్లైతే చికెన్ బెస్ట్ ఆప్షన్ గా చెబుతారు. ఇందులో అధిక శాతంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. మీకు తెలిసే ఉంటుంది. డి విటమిన్ వల్లే మన శరీరంలో క్యాల్షియం ఉత్పత్తి అవుతుందని. ఆస్పరాగస్ లో డి విటమిన్ పుష్కలంగా ఉండి. ఇందులో ఉండే ఆరోమాటిక్ ఫ్లేవర్ మార్నింగ్ సిక్ నెస్ ను పోగొడుతుంది.
అయితే బెండకాయ అరుదుగా తింటారు. అయితే ఇందులో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. బెండకాయలోని ఫోలిక్ యాసిడ్స్ పుట్టుకతో లోపాలను నిరోధిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో మధుమేహానికి గురైయ్యే మహిళలకు చాలా మంచి చేస్తుంది థ ఫోలిక్ యాసిడ్. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.
బ్రొకోలీ గ్రీన్ సూపర్ ఫుడ్. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని మొదటి మూడు నెలలు తీసుకోవడం చాలా మంచిది. దీని తినడం వల్ల తల్లికి కావల్సిన ఐరన్ అంధించడమే కాకుండా అధిక రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి, విటమిన్ బి12 ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.