అమ్మ: గర్భిణి స్త్రీలు మూడు వాసనలను అసలు పీల్చ కూడదు..!?
ఈ వాసన పీలిస్తే పుట్టుకతో వచ్చే లోపాలు లేదా అకాల పుట్టుక యొక్క ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ద్రావకాలు లేదా స్ప్రేలు లేని ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. గదిని బాగా వెంటిలేషన్ గా ఉంచే విధంగా చూడండి. అసలు వాల్ పెయింట్ కి దూరంగా ఉంటే చాలా మంచిది. దానిలో వాడే కొన్ని రసాయనాలు ఇబ్బంది పెట్టవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో మహిళలు దోమల నివారణ స్ప్రేలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో శిశువుకు హానీకరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దోమల నుంచి కాపాడినా సరే వాటిలో ఉండే ఇతర రసాయనాలు మీకు హాని కలిగిస్తాయి. ఇవి చర్మం ద్వారా లోపలి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
ఇక సాధారణంగా నాఫ్తలీన్ బాల్స్ ఇళ్ళల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కీటకాలు రాకుండా రక్షణ కోసం వాడుతూ ఉంటారు జనం. మనం వాడే మాత్ బాల్స్ 98% నాఫ్థలీన్ కలిగి ఉంటుంది, ఇది ఒక విష రసాయనం. దీని వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. వీటి వల్ల పిండంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అవి సరిగా నిల్వ చేయకపోతే, అది తీవ్రమైన సమస్యలను తెస్తుంది.