అమ్మ: గర్భిణుల బొడ్డుతాడును దెబ్బతీస్తున్న కాలుష్యం..!?
అయితే తల్లీబిడ్డలను కలిపే బొడ్డు తాడును దెబ్బతీయడం ద్వారా వాయు కాలుష్యం పిండాన్ని దెబ్బతీస్తున్నది. ఇక దక్షిణాసియాలో గర్భధారణపై కాలుష్యం యొక్క ప్రభావాన్ని చూపించే మొదటి అధ్యయనం ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా దక్షిణ ఆసియాలో గర్భాలు దెబ్బతింటున్నాయి. అయితే 2000-2016 మధ్య దక్షిణ ఆసియాలో కలుషితమైన గాలి 7.1 శాతం గర్భస్రావాలను కలిగించినట్లు పరిశోధకులు గుర్తించారు. భారతదేశంలో ప్రస్తుత గాలి నాణ్యత ప్రమాణం క్యూబిక్ మీటరుకు 40 మైక్రోగ్రాములుగా ఉన్నది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకం ప్రకారం, క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు సురక్షితంగా భావిస్తారు.
ఇక గర్భధారణ సమయంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. పుట్టబోయే బిడ్డపై కాలుష్యం విపరీతమైన ప్రభావం చూపుతుంది. తల్లి ఏది తిన్నా.. అది నేరుగా పిల్లలకు చేరుతుంది. కలుషితమైన గాలిని పీల్చడం పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రీ-మెచ్యూర్ డెలివరీ ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది. శిశువు పుట్టినప్పుడు బరువు తగ్గవచ్చు. అలాగే, పోషకాహార లోపానికి కారణమవుతుంది. పిల్లలలో అభివృద్ధి మందగిస్తుంది. గర్భంలో ఉన్న శిశువు సరైన ప్రాణవాయువు పొందక పుట్టకముందే ఆరోగ్య సమస్యలను పొందే అవకాశాలు ఉంటాయి. గర్భస్రావాలు జరిగేందుకు కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.