అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది
దీంతో అపర్ణకు కేరళ వాతావరణం అలవాటైపోయింది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయినా అక్కడ ఉండలేకపోయింది. ఇక్కడి సంస్కృతిని వదల్లేకపోయింది. అందుకని ఆరు నెలల క్రితం ఇన్‌వర్టెడ్ కోకోనట్ పేరుతో ఇన్‌స్టాగ్రమ్ ఖాతాను తెరిచింది. మలయాళం ఎంతో స్పష్టంగా మాట్లాడగలదు కాబట్టి.. ఇప్పుడు యూరోపియన్లకు ఈ భాషను నేర్పుతోంది. అపర్ణ కేరళలో పెరిగినా పాఠశాలలో సంస్కృత భాషను తన లాంగ్వేజ్‌గా ఎంచుకుంది. అయినప్పటికి మలయాళం నేర్చుకోవాలనే ఆత్రుతతో స్నేహితుల సహాయంతో మలయాళం భాషను అపర్ణ నేర్చుకుంది. ఆమె చదివింది ఇంగ్లీష్ మీడియం అయినా స్నేహితులందరూ ఆమెతో మలయాళంలోనే మాట్లాడేవారు. అలా అపర్ణకు మలయాళం బాగా వంటబట్టింది.
‘నా భారతీయ సంస్కృతీ మూలాలను వదులుకోవద్దన్నారు మా నాన్న. అంతేకాదు నా అసలైన ఉనికిని పోగొట్టు కోవద్దన్నారు. అలా నాకు ఆయన మార్గనిర్దేశం చేశారు’ అని అపర్ణ చెబుతోంది. ఈ కారణంగానే అపర్ణ అమెరికాలో ఉన్నప్పటికి తన మలయాళం భాషను, భారతీయ సంస్కృతిని వదలకుండా ముందుకు పోతోంది. అపర్ణ పేరు నిజానికి శైషా. అయితే ఆరేడేళ్ల వయసులో ఆమె పేరును శైషా నుంచి అపర్ణగా మార్చారు.