అమ్మ : గర్భిణీ స్త్రీ తీసుకునే ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి.. !!

Suma Kallamadi
గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే కడుపులోని బిడ్డకూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే గర్భిణీ స్త్రీ నిత్యం సంతోషంగా, ఆనందంగా ఉండాలి. అలాగే అన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వలన గర్భవతిగా వున్న సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కొనవచ్చు . అందుకనే తీసుకునే ఆహారం విషయంలో ఒక ప్రణాలికను రూపొందించుకోవాలి.  తయారుచేసుకున్న ప్రణాళికలో కావలసిన పోషకాలను సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆహారాన్ని తగిన సమయంలో తీసుకోవాలి. గర్భిణీ స్త్రీ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.. మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా క్యాల్షియం, ప్రోటీన్స్, ఐరన్, విటమిన్ సి,  ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

ఆడవారు మాములుగా తీసుకునే దాని కంటే గర్భంతో ఉన్న సమయంలో ప్రతిరోజు 300 నుండి 400 క్యాలోరీలను ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రసవానికి ముందుగా తప్పకుండా తీసుకోవాలి. గర్భంతో ఉన్నవారు ముఖ్యంగా తీసుకోవలసిన ఇంకొక మూలకం మినరల్స్. గర్భ సమయంలో వారి శరీరం లోపల,  బయట వచ్చే మార్పులకు తట్టుకొని, ఆరోగ్యవంతమైన ప్రసవం జరగాలి అంటే మినరల్స్ తప్పనిసరిగా అవసరం. ఆక్సిజన్, పోషకాలను శరీర అన్ని భాగాలకు అందేలా చేసే ఎర్ర రక్తకణాల ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కడుపుతో ఉన్న మహిళకు మీరు తీసుకునే ఆహారంలో అవసరం మేరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్  సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

 గర్భ సమయంలో వారి జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. కావున మీరు త్వరగా జీర్ణం కానీ ఆహారాన్ని తినటం వలన శరీరంలోని విసర్జక పదార్థాలు బయటికి పంపటంలో విఫలం అవటం వలన రక్తం చెడిపోయి ఇతరేతర ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. కావున త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి.గర్భంతో ఉన్నవారు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, రోజు తీసుకునే ఆహారంలో పండ్లను తప్పకుండా తీసుకోవాలి.  ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను తినండి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు,  పాల పదార్థాలను తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: