అమ్మ : గర్భవతులు వీటిని ఎక్కువగా తినకూడదు తెలుసా.. !!
అలాగే కొంతమంది మహిళలు చర్మ సౌందర్యం కోసం ‘విటమిన్ ఇ’ సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ క్రమం తప్పకుండా విటమిన్ ఇ తీసుకునే వాళ్లకి ‘ఆల్కాజ్ మొటాలిటీ’...అంటే ఏ ఆరోగ్య సమస్యతోనైనా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు పెరుగుతాయి. ఇందుకు కారణం విటమిన్ ఇ సప్లిమెంట్లను వాడటం వల్ల శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. రోజుకి 30 మైక్రో యూనిట్ల విటమిన్ ఇ మాత్రమే అవసరం. ఇంతకు మించితే శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. అయితే గర్భిణులు వీటిని వేసుకోకపోవడమే అన్ని విధాల మంచిది. అయితే తప్పనిసరై విటమిన్ ఇ తీసుకోవల్సి వస్తే టాబ్లెట్ గా కాకుండా నేరుగా చర్మం అప్లై చేసే వాటిని వాడటం మంచిది. దీని వల్ల శరీరంలో టాక్సిసిటీకి అవకాశం ఉండదు పైగా మంచి ఫలితం కూడా ఉంటుంది.
శరీరానికి కావల్సిన క్యాల్షియం ఆహారం ద్వారా తీసుకోగలిగితే అదనంగా సప్లిమెంట్ల అవసరం ఉండదు. కాల్షియం, విటమిన్డి ఎక్కువగా తీసుకుంటే ‘హైపోకాల్సీమియా’ సమస్య ఉత్పన్నం అవుతుంది.పొగతాగే అలవాటు, మద్యం సేవించే అలవాటు ఉండే వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలనుకునే మహిళలు దురలవాట్లకు దూరంగా ఉండాలి. నెల తప్పగానే చాలామంది మహిళలు బెడ్ రెస్ట్ అంటూ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు. ఇది సరి కాదు. కాబోయే అమ్మల శారీరక వ్యాయామం, మానసిక ఆనందం కడుపులోని బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది.. !!