అమ్మ : గర్భిణీ స్త్రీ లో ప్రసవ లక్షణాలు ఎలా ఉంటాయంటే..??

Suma Kallamadi
చాలా మంది గర్భిణీ స్త్రీలు  ప్రసవం ఎలా అవుతుందో అని ఆందోళనలో ఉంటారు. ఒకవేళ
గర్భిణీ స్త్రీకి ఇదే మొదటి ప్రసవం అయితే,  నొప్పులు వస్తున్నాయా లేదా అనే విషయం మీకు అంతగా తెలియదు. ఒకవేళ మీకు ఇదివరకే శిశువు ఉంటే, మీకు తెలుస్తుంది. ఎందుకంటే, మీరు గతంలో ఎలా అనుభూతి చెందారో మీకు గుర్తుండే ఉంటుంది. మీకు గర్భాశయ సంకోచాలు కలగవచ్చు. అవి మీరు గర్భవతిగా ఉన్న కాలమంతటా కలుగుతూ ఉంటాయి. కానీ మీకు అవి ప్రసవ నొప్పులా లేక వాతపు నొప్పులా అనే విషయం తెలియాలి. ప్రసవ నొప్పులు అయితే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటారు. అవేంటో తెలుసుకోండి..


బిడ్డను ప్రసవించడానికి ముందు, మీ వీపు క్రింది భాగంలో లేదా మీ నడుము క్రింది భాగంలో నొప్పిగా ఉంటుంది. అలాగే మీకు ఈడ్పుల వంటి అనుభూతులు, అంటే మీకు నెలసరి ప్రారంభమయ్యేటప్పుడు, పొత్తికడుపులో వచ్చే నొప్పులు ఉన్నాయా.. లేదా అనేది తెలుసుకోండి. అంతేకాకుండా మీ యోని నుండి ముదురు గోధుమ వర్ణంలో  గాని లేదా రక్తంతో కూడిన జెల్లీ వంటి జిగట ద్రావకం అనేది వస్తూ ఉంటే మీరు బిడ్డను కనటానికి రెడీ గా ఉన్నట్లు అర్ధం..

మీకు ఎక్కువ సేపు,  అలాగే ఎక్కువ బలంగా సంకోచాలు వస్తున్నాయా? సంకోచాలు ముట్లనొప్పుల వంటివి. మొదట్లో అవి వచ్చి పోతూ ఉంటాయి. కానీ ప్రసవ నొప్పులు మాత్రం క్రమంగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య.కేంద్రానికి వెళ్ళండి.అలాగే కొంతమందికి  ఉమ్మనీరు పగిలిపోతుంది. ఉమ్మనీరు అంటే ఏంటంటే, మీ బిడ్డ లోపల కడుపులో ఉన్నప్పుడు ఒక ద్రావకం యొక్క సంచిలో తేలియాడుతూ ఉంటుంది. ఆ సంచిలోని ద్రావకం బొట్లు బొట్లుగా లేదా ఎగజిమ్మిన్నట్లు బయటకు యోని ద్వారా బయటకు వస్తాయి.. అప్పుడు మీరు వెంటనే హాస్పిటల్ కు వెళ్ళండి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: