అమ్మ : గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు, వ్రతాలు చేయడం మంచిదేనా..??

Suma Kallamadi


ఆడవాళ్లకు సహజంగానే భక్తి భావం చాలా ఎక్కువగానే ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు.పూజలు, వ్రతాలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. ఇంట్లో కూడా నిత్యం దీప ధూపాలతో పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇది అంతా ఎందుకు అనుకుంటున్నారా.. !!
ఆడవాళ్లు గర్భాన్ని ధరించినప్పుడు అసలు పూజలు, వ్రతాలు చేయవచ్చా..? లేదా అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. అసలు గర్భంతో ఉన్న మహిళ పూజలు చేయవచ్చా...లేదా.. గుడికి వెళ్లి దీపారాధన చేస్తే మంచి జరిగిద్దా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. !!



గర్భవతి నివాసం ఉండే గృహ ప్రభావం ఆమెపైన, ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల మూడు నెలలు పైన గర్భవతిగా ఉన్న మహిళ ఇంట్లో ఉంటే  ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఇంటికి మార్పులు, చేర్పులు కాని, కొత్త నిర్మాణం చేపట్టడం గానీ మంచిది కాదు.అలాగే స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా అంటే అనే సందేహంలో పడుతుంటారు.  గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించవచ్చు అంట. కానీ ఎట్టి పరిస్థితులలోనూ  కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని చెబుతున్నాయి. అలాగే గుడి చుట్టు కూడా  ప్రదక్షిణాలు చేయకూడదని చెబుతోంది.



ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుని ఆరాదిస్తే అంతా మంచే జరుగుతుంది అంట.  గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది.పూజలు, వ్రతాలు పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి.. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది. అలాగే ఒక్కోసారి పూజలు చేసినప్పుడు ఉపవాసం ఉండాలిసిన పరిస్థితి వస్తుంది.. అలా ఏమి తినకుండా గర్భవతి ఉంటే నీరసం వస్తుంది. బిడ్డ ఆరోగ్యానికి హాని జరుగుతుంది... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: