సొట్టబుగ్గలు కావాలనుకునే ఆడవాళ్ళకి కొన్ని చిట్కాలు.. !!
ఆడవాళ్లు సెల్ఫీలు లాంటి ఫొటోలు తీసుకునేటప్పుడు టెంపరరీగా సొట్ట బుగ్గలు కావాలంటే ఓ పని చేయండి. వేలితో కానీ, పెన్సిల్‌తో కానీ బుగ్గ మీద ఓ అయిదు నిమిషాలు నొక్కి ఉంచితే బుగ్గలు టెంపరరీగా సొట్టపడతాయి. అంటే ఒక 2 నిమిషాల పాటు డింపుల్ అలానే ఉంటుంది..అలాగే చొట్ట బుగ్గలు కావాలనుకునేవారు ప్రతి రోజూ ఓ అరగంట పాటు బుగ్గల్ని వేలితోగాని లేదా పెన్సిల్‌తో గాని నొక్కి ఉంచితే పర్మనెంట్‌గా బుగ్గలు సొట్టబడతాయని చెబుతున్నారు. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండ చేయాలి. కానీ ఇదెంతవరకు వాస్తవమో అన్న విషయం మీద క్లారిటీ లేదు.
సొట్టబుగ్గలకి కావాలనుకునే ఆడవాళ్లకి అన్నింటికంటే మంచి చిట్కా ఉంది. అదేంటంటే నవ్వేటప్పుడు కనుక మనం మనస్ఫూర్తిగా విశాలంగా నవ్వితే... చాలామంది బుగ్గలు సొట్టపడతాయట.అలాగే మేకప్ వేసుకునేటప్పుడు ఓ చిన్న చిట్కా పాటించినా బుగ్గల మీద సొట్ట ఉన్నట్లు కనిపిస్తుంది. దానికోసం నవ్వేటప్పుడు మడత పడే చోట... మన స్కిన్ రంగు కంటే కాస్త తక్కవ రంగు ఫౌండేషన్‌ని గుండ్రంగా అప్లై చేయాలి.తర్వాత ఒక క్లాత్ తో తుడిచి తుడవనట్లు చిన్నగా తుడవాలి..ఇవేవీ వద్దు.. మీకు శాశ్వతంగా సొట్టబుగ్గలు కావాలనుకుంటే అయితే దానికి చిన్నపాటి కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది.