అమ్మ : గర్భిణీ స్త్రీ అసలు తినకూడని ఆహార పదార్ధాలు ఇవే... !!
కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు తినకూడదు . దీనివల "లిస్టరియోసిస్ " అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశము ఉన్నది . దీనివల గర్భస్రావం అయ్యే అవకాశము ఉన్నది
అలాగే శరీరానికి అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొ అంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.అలాగే నిల్వ ఉంచిన పచ్చళ్ళు కూడా అసలు తినకూడదు. అలాగే పాలు కూడా బాగా కాసిన తర్వాత తాగాలి. పాచ్యురైజేషన్ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధములు తినకూడదు. పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు . పచ్చి గుడ్డు లో సాల్మొనెల్లా అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.
కాఫీ లోని కెఫిన్, కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది.సారా (Alcohol), సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు . బేబీ పెరుగుదలను , ఆరోగ్యాన్ని దెబ్బతీయును.దీనివల్ల కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగును.కాయకూరలు బాగా కడిగి తినాలి .కడగని ఆకుకూరలు , కాయలు , పండ్లు పైన అనేక రకాలు అయిన బాక్టీరియా ఉంటుంది. ఏది తల్లి బిడ్డ ఆరోగ్యానికి హానికరం.