బుడుగు: పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. !!

Suma Kallamadi
చంటి పిల్లల విషయంలో తల్లి తండ్రులు చాలా జాగ్రత్తలు వహించాలి. పుట్టిన దగ్గర నుండి పలు రకాల మసాజ్ చేయడం బిడ్డ శరీరానికే కాదు, మానసికంగా తల్లీ బిడ్డల మద్య ప్రేమ బంధాన్ని పెరిగేట్లుగా కూడా సహాయ పడుతుంది.బేబీ పుట్టిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు, చాలా ముఖ్యమైన సమయం. బేబీకి అంతా కొత్తగా ఉండటం, నేర్చుకోవడానికి , ఎదుగుదలకు మంచి సమయం. బేబీలో అన్ని రకాల కదలికలు, గ్రహించే శక్తి, వినికిడి వంటి సెన్స్ ను కలిగి ఉంటారు.

ఇలాంటి సమయంలో సున్నితమైన మసాజ్ వల్ల బేబీ శరీరం మంచిగా ఉంటుంది.  సున్నితమైన ఆయిల్ మసాజ్ వల్ల బాడీలో ఉష్ణం పెరిగి, బేబీ వెచ్చగా ఉండటానికి మసాజ్ ఉపయోగపడుతుంది.బిడ్డకు మసాజ్ చేసేటపుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.బిడ్డ మెలుకువగా ఉండి, ఆడుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడే మసాజ్ చేయాలి.అలాగే పలు తాగిన గాని, ఏదన్నా తిన్నా గాని అసలు మసాజ్ చేయకూడదు. పలు తాగిన గంట తర్వాత మసాజ్ చేయాలి.అలాగే బిడ్డను మసాజ్ చేయడానికి పడుకోబెట్టే క్లాత్ చాలా మెత్తగా చదునుగా ఉండాలి.పిల్లవాడికి ఇబ్బంది లేకుండా కింద క్లాత్ ను పరచాలి. అలాగే బిడ్డకు మసాజ్ చేయని భాగాలను కప్పి ఉంచాలి.

మసాజ్ మొదలుపెట్టే ముందు,  మసాజ్ చేస్తున్నప్పుడు బిడ్డతో ప్రేమగా మాట్లాడుతూ చేయాలి.
మసాజ్ కోసం వాడే నూనె సెంట్ పరమళం లేకుండా ఉండాలి.మసాజ్ చేస్తున్నప్పుడు నూనెను మృధువుగా రాస్తూ నెమ్మదిగా శరీరం పై చేతిని కదిలిస్తూ మసాజ్ చేయాలి.మసాజ్ చేస్తున్న సమయంలో బిడ్డ అటూ ఇటూ కదులుతుంటే కదలికను ఆపవద్దు.ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసేప్పుడు పెద్దవారికి లాగే పిల్లలకు ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. బేబి చర్మంలోనికి ఇమిడేట్లు చేస్తే చాలు..అలాగే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.నెమ్మదిగా మసాజ్ చేయాలి. బేబీ మసాజ్ కి  వాడే నూనె బాగా వేడిగా ఉండకూడదు. గోరువెచ్చని నూనెతో మాత్రమే మసాజ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: