ఆడవాళ్ళ చర్మం మెరిసిపోవాలంటే కాఫీ పొడితో ఇలా చేయండి.. !!

Suma Kallamadi
ఆడవాళ్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఎదుటివారిని ఆకర్షించాలంటే అందం చాలా ముఖ్యం. అందుకే  ప్రతి అమ్మాయి అందంగా కనబడాలని కోరుకుంటుంది.అందు కోసం కోసం ఎన్నో క్రీములు, ఫేస్ ప్యాక్ లు, లోషన్లు వాడతారు. కానీ ఏటువంటి ఫలితం ఉండదు.అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే  మన వంటింట్లో దొరికే కాఫీపొడిని ఉపయోగించి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని. కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్ లు సమృద్ధిగా ఉంటాయి.కాఫీ గింజలు చర్మంలోని స్వేద గ్రందులను శుభ్రపరుస్తాయి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీరు కాఫీ పొడితో మెరిసిపోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ కాఫీ పొడి కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు తొలిగిపోతాయి.అలాగే చాలా మంది ఎదుర్కునే ప్రధాన సమస్య ముఖం, మెడ వద్ద చర్మం నలుపుగా ఉండడం. కాఫీ పౌడర్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కలిపి రాసుకుంటే ఇది చర్మం లోపలి భాగాలకు చొచ్చుకునిపోయి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.మొటిమల సమస్యతో ఇబ్బందిపడేవారు కాఫీ గింజలను గ్రైండ్‌ చేసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు, ఆలివ్‌ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి  అప్లై చేసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. అలాగే ముడతల్ని కూడా దూరం చేస్తుంది.


ఒక స్పూన్ కాఫీ పౌడర్ కు ఒక  స్పూన్ పెరుగు కలిపి ముఖానికి మెడకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత వాటర్ తో కడగాలి. ఇది ముఖంపై నిర్జీవ చర్మకణాలను తొలగించి చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. ఇది వారానికి రెండు సార్లు అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు.కాఫీ పొడిని ముఖానికి పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయండి. ఇది మృతచర్మాన్ని తొలగిస్తుంది. చర్మ గ్రంథుల్ని బిగుతుగా మారుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: