ఆడవాళ్ళలో గర్భాశయంలో ఏర్పడే నీటిబుడగలను (PCOD) తగ్గించే గృహ నివారణ చిట్కాలు.. !!
ఈ నీటిబుడగల సమస్య నుండి ఆడవాళ్లు త్వరగాకోలుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలతో పాటు ఆరోగ్యకరమైన వ్యాయామాలను చేస్తే PCOSను సమర్థవంతంగా నయం చేయవచ్చు.
హార్మోన్ల లోపాలను చికిత్స చేయడంలో ఆముదం ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీనిని పూయటం వలన కడుపు క్రింద ప్రాంతంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. ఎక్కువ ఫలితాన్ని పొందేందుకు సేంద్రీయ ఆముదమును వాడండి. హాట్ బాగ్ పై కొన్ని చుక్కల ఆముదమును వేసి ఇది చల్లబడే వరకు మీ ఉదరం పైన రాయాలి. PCOD సమస్య ఉండే వారికి ఇన్సులిన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అందువలన వీరు చక్కెరను వాడకూడదు దానికి బదులుగా బెల్లంను వాడాలి.
ఇది ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది.జీలకర్రలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను కూడా నియంత్రిస్తుంది. కొన్ని పచ్చి జీలకర్రను పొడి చేసుకొని నీలల్లో కలిపి త్రాగండి.ఇది PCOS సమస్యకు ఒక అద్భుతమైన నివారిణి. రోజూ ఒక టేబుల్ స్పూన్ చెక్క పొడిని వెచ్చని నీటిలో కలుపుకొని తెల్లవారు జామున ఖాళీ కడుపుతో త్రాగండి. లేదా ఒక దాల్చిన చెక్క ముక్కని మొత్తం తినవచ్చు.ఇది ఎక్కువ కేలరీలను దహించి రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మరికొన్ని చిట్కాలు తదుపరి ఆర్టికల్ లో చూద్దాం.. !!